New Delhi, Feb 24: ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్ (military operations) ప్రారంభించింది. దీంతో దేశంలోని విమానాశ్రయాలు, గగనతలాన్ని ఉక్రెయిన్ మూసింది (Closes Airspace). దీంతో ఆ దేశంలో ఉన్న భారత విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు కీవ్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) వెనక్కి వచ్చేసింది. గురువారం ఉదయం 7.30 గంటలకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి ‘ఏఐ 1947’ ఎయిర్ ఇండియా విమానం (Air India flight) ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు బయల్దేరింది. అయితే రష్యా యుద్ధం నేపథ్యంలో గగనతలాన్ని మూసేస్తున్నట్లు ఉక్రెయిన్ (Ukraine) ప్రకటించింది. దీంతో ఎయిర్ మిషన్ సూచన మేరకు అధికారులు విమానాన్ని మళ్లీ భారత్‌కు మళ్లించారు.
Air India flight AI1947 is coming back to Delhi due to NOTAM (Notice to Air Missions) at, Kyiv, Ukraine. pic.twitter.com/C6OKj7xMF9
— ANI (@ANI) February 24, 2022
కీవ్ నుంచి బయల్దేరిన ఓ విమానం గురువారం ఉదయం 7.45 గంటలకు ఢిల్లీకి చేరింది. అందులో 182 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు.
గతంలో ఉక్రెయిన్‌లో జరిగిన అంతర్గత పోరులో మలేషియాకు చెందిన విమానం కూలిపోయింది. 2014లో రష్యా అనుకూల వేర్పాటువాదులు, ఉక్రెయిన్ సైన్యానికి మధ్య భీకర పోరు జరిగింది. ఈ క్రమంలో వేర్పాటువాదులు మలేషియా విమానాన్ని కూల్చివేశారు. దీంతో విమానంలోని 298 మంది మృతిచెందారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తుగా గగనతలాన్ని మూసివేసింది ఉక్రెయిన్.