Moscow, Feb 24: అనుకున్నదంతా అయింది. ఉక్రెయిన్ (Ukraine)తో రష్యా(Russia) యుద్ధం (War) మొదలైంది. ఉక్రెయిన్ పై సైనిక చర్యకు ఆదేశించారు అధ్యక్షుడు పుతిన్(Putin). ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ మొదలైందని ప్రకటించారు. ఈ సందర్భంగా డోన్భాస్‌లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్ వార్నింగ్ (Putin Warning) ఇచ్చారు. ఉక్రెయిన్ (Ukrain) ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు.వారి చేతుల్లోని ఆయుధాలు వదిలేయాలని ఉక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌ని కలుపుకునే ఆలోచన మాత్రం రష్యాకు లేదని, సమస్య వచ్చినప్పుడు మాత్రం రష్యా స్పందిస్తుందని పుతిన్ స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పేలుడు సంభవించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురతవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు.
#UkraineRussiaCrisis | (Post the announcement of a 'military operation' in Ukraine by Russian President Vladimir Putin), an explosion was heard in Kyiv; oil prices break $100 on Russian 'military operation' in Ukraine: AFP
— ANI (@ANI) February 24, 2022
ఉక్రెయిన్ లో బుధవారం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించగా.. ఈ సంక్షోభానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఉక్రెయిన్‌పై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కావడం ఈ వారంలో ఇది రెండోసారి.ఇది జరుగుతుండగానే పుతిన్ ప్రకటన తర్వాత యుక్రెయిన్‌లో పలు నగరాలపై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది.
ఉక్రెయిన్‌పై దండెత్తేందుకు రష్యా సిద్ధమైన క్రమంలోనే అక్కడి తమ దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించింది రష్యా. మరోవైపు తమపై విధించిన ఆంక్షలకు అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని రష్యా హెచ్చరిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా రష్యాలోని తమ పౌరులను వెనక్కి రావాలని ప్రకటించింది.
పశ్చిమ దేశాలు ఆంక్షల కొరఢా ఝుళిపిస్తున్నా రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి కొత్తగా.. అదనపు బలగాలతో మోహరించి యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్‌గొరొడ్ నైరుతి ప్రాంతంలో సైనికులు, ఆయుధ వ్యవస్థలను మోహరించి దాడులు చేస్తోంది.