Image used for representational purpose. | (Photo credits: PxFuel)

Thrissur, February 20:  కేరళలో నోవెల్ కరోనావైరస్ (Coronavirus) లేదా కోవిడ్ -19 (COVID) బారిన పడిన ముగ్గురు రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కేరళలో నమోదైన మూడు పాజిటివ్ కేసులలో ఇటీవలే ఇద్దరు డిశ్చార్జ్ అవ్వగా, గురువారం మూడవ పేషెంట్ (Third Patient) ను కూడా డిశ్చార్జ్ (Discharge) చేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కేరళలో పాజిటివ్ రిపోర్టులు వచ్చిన వారందరూ చికిత్స ద్వారా కోలుకొని ఇప్పుడు పూర్తిగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ లెక్కన భారత్ లో ప్రస్తుతం కరోనావైరస్ పాజిటివ్ కేసులేవి పెండింగ్ లో లేనట్లే.

కాగా, ఈరోజు డిశ్చార్జ్ అయిన పేషెంట్ ఇండియాలో తొలి కోవిడ్19 పాజిటివ్ కేసుగా నమోదు కాబడ్డారు. గతనెల చైనాలోని వుహాన్ నగరం నుంచి తన స్వరాష్ట్రమైన కేరళ తిరిగి వచ్చిన ఈ వైద్య విద్యార్థినికి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని రిపోర్టులో తేలింది. దీంతో అప్పట్నించి ఈమెను త్రిశూర్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్సనందిస్తూ వచ్చారు. కోవిడ్ 19కు వ్యాక్సిన్ తయారీ, 6 నెలల్లోపు మనుషులపై ప్రయోగం

ఈమె తర్వాత మరో ఇద్దరు కేరళ విద్యార్థులకు కూడా రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది. వీరిలో ఒకరికి అలప్పుజ ఆసుపత్రిలో చికిత్స అందివ్వగా, మరొకరికి కాసర్గోడ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్సనందించారు. అయితే తొలి పేషెంట్ కంటే ఈ ఇద్దరు వేగంగా కోలుకొని ఒకరు ఫిబ్రవరి 13న,  మరొకరు ఫిబ్రవరి 17న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి, ప్రస్తుతం రెండు వారాల గృహ నిర్భందంలో ఉన్నారు.ఇక వీరి తర్వాత కాస్త ఆలస్యంగా సుమారు నెలన్నర చికిత్స తర్వాత తొలి పేషెంట్ ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు.

Here's the latest update: 

ఈమె రక్త నమూనాల్లో వైరస్ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే కాక, రెండు సార్లు పరీక్షలు నిర్వహించగా, రెండు రిపోర్టుల్లోనూ నెగెటివ్ అని వచ్చింది. దీంతో డిశ్చార్చ్ చేసినట్లు కేరళ వైద్యశాఖ మంత్రి కే.కే. శైలజ తెలిపారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఏమీ లేవని ఆమె స్పష్టం చేశారు.

మరోవైపు, ఘోరమైన ఈ కరోనావైరస్ ప్రభావంతో చైనాలో మరణించిన వారి సంఖ్య 2,118 కు పెరిగింది, అలాగే ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 74,576కు చేరినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది.