Gurawara, December 28: భారత్‌నెట్ (Bharatnet) ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలకూ వచ్చే మార్చి వరకు వైఫై ఉచితంగా (Free WiFi Services)అందిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (IT Minister Ravi Shankar Prasad) హర్యానాలోని (Haryana) రేవారికి వచ్చిన సందర్భంగా చెప్పారు. ‘‘భారత్‌నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఇప్పటికే 1.3 లక్షల గ్రామ పంచాతీయలకు అనుసంధానించాం. 2.5 లక్షల గ్రామ పంచాయతీలను చేరుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
భారత్‌నెట్ సేవలను ప్రోత్సహించేందుకు గాను ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ 2020 మార్చి వరకు ఉచితంగా వైఫై సేవలను అందిస్తున్నాం. భారత్ నెట్‌వర్క్‌కు అనుసంధానమైన మొత్తం గ్రామాల్లో ప్రస్తుతానికి 48,000 గ్రామాల్లో వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి’’ అని మంత్రి వెల్లడించారు.భారత్‌నెట్‌తో అనుసంధానమైన అన్ని గ్రామాల్లో ఉచిత వైఫై సేవలకు ఎలాంటి రుసుం అమలు చేయబోమని, 2020 వరకు ఉచితంగానే అందిస్తామని ఆయన అన్నారు.
అన్ని సాధారణ సేవా కేంద్రాలు (సిఎస్‌సి) డిజిటల్ సేవలను అందించడానికి యాక్సెస్ పాయింట్లుగా పనిచేస్తాయి. ఈ కేంద్రాల సంఖ్య 2014 లో సుమారు 60,000 ఉండగా, ప్రస్తుతం 3.60 లక్షలకు పెరిగింది. హర్యానాలో 11,000 సిఎస్‌సిలు 650 వివిధ రకాల సేవలను అందిస్తున్నాయి. సిఎస్సి ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ సేవలను అందిస్తోంది. మొత్తంమీద లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా మార్చడానికి సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి తెలిపారు.