Allu Arjun Pushpa 2: The Rule Locks First Half pre-release business worth Rs 1000 crore Report

పుష్ప 2 సినిమాకు కర్ణాటకలో ఊహించని షాక్ తగిలింది.ఈ మూవీని కర్ణాటకలో మిడ్ నైట్, తెల్లవారుజామున ప్రదర్శించవద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 6 గంటల కంటే ముందు సినిమాను ప్రదర్శించడం అక్కడ చట్ట విరుద్ధమని కన్నడ ప్రొడ్యూసర్‌లు ఫిర్యాదు చేశారు. దీంతో బెంగళూరు జిల్లా కలెక్టర్ థియేటర్ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో స్పెషల్ షోల ప్రదర్శనకు అభిమానులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ తరుణంలో ప్రభుత్వ నిర్ణయంతో అల్లు ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

ఒళ్లు కొవ్వెక్కి మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నావు, చిరంజీవి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకో, అల్లు అర్జున్‌పై జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు తీవ్ర వ్యాఖ్యలు

ప్రస్తుతం పుష్ప 2 మేనియాతో దేశం మొత్తం ఊగిపోతోంది. ఈ సినిమాని దాదాపు 6 భాషల్లో 12 వేల స్క్రీన్‌లలో రిలీజ్ చేయబోతున్నారు. ఏపీ, తెలంగాణాలోని చిన్నా, పెద్దా థియేటర్‌లలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దీనికోసం యావత్ సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రేపు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.