Anantapur, Oct 22: అనంతపురంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వరదకు పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. పండమేరుకు వరద పోటెత్తడంతో ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీ నీట మునిగింది.అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
గత రాత్రి నుంచి రామగిరి, చెన్నే కొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వరద నీటితో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు కనగానపల్లి చెరువుకు గండి పడటంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. రామగిరి - ఎన్‌ఎస్ గేట్, ముత్తవకుంట్ల - కనగానపల్లి, తగరకుంట - కనగానపల్లి రహదారులన్నీ బ్లాక్ అయ్యాయి. ప్రసన్నయపల్లి నుంచి ఉప్పరపల్లి వరకు పండమేరు వాగు పరివాహక ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి.
Anantapur Rains Videos
VIDEO | Heavy rainfall triggers severe flooding in parts of Anantapur district, Andhra Pradesh.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)
(Source: Third Party) pic.twitter.com/66HdUsqpK2
— Press Trust of India (@PTI_News) October 22, 2024
Pandameru vanka near Anantapur city flooding after heavy rains yesterday!
Near Ayyavaripalli, Raptadu ! pic.twitter.com/mc2eoa1PP0
— Naveen Reddy (@navin_ankampali) October 22, 2024
నిన్న రాత్రి నుండి వచ్చిన వాన కి పొద్దున్న ఇది పరిస్థితి . రామగిరి మండలం . #అనంతపురం #Anantapur pic.twitter.com/cxLdu80SzS
— Dr.మహిష్మ.కె (@drmahishmak) October 22, 2024
పండమేరు వంక ఉదృతంగా ప్రవహిస్తోంది. సురక్షితంతగా బయటపడిన ప్రజలు. వాహనాలు కొట్టుకుపోయాయి.#Anantapur #ANANTAPURAMU #heavyrain 🚨🚨 pic.twitter.com/azxBNlg6WG
— Bhaskar Reddy (@chicagobachi) October 22, 2024
రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, పోలేపల్లి - అక్కంపల్లి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సునీత.. తీవ్ర వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలిస్తున్నారు. వర్షాలతో తీవ్ర పంట నష్టం వాటిల్లిందంటూ బాధితులు బోరున విలపించారు. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుట్టపర్తి వద్ద చిత్రావతి నది పొంగి పొర్లతుండడంతో రాయలవారి పల్లి, కోవేలగుట్ట పల్లి వంతెనలపై భారీగా వర్షపు నీరు పారుతోంది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారు.
రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో గత రాత్రి భారీగా వర్షం కురిసింది. ఈ క్రమంలో కనగానపల్లి మండల కేంద్రంలో వర్షపు నీటి ధాటికి చెరువు కట్ట తెగిపోయింది. దీంతో గ్రామంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు జేసీబీల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పలు గ్రామాలలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. అలాగే పంటపొలాలు నీటమునిగాయి. వాగులు ప్రవహిస్తుండటంతో పలుచోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక పెట్రోట్ బంక్‌లోకి నీరు చేరింది. కనగానపల్లి చెరువు కట్ట తెగి వరద పండమేరులోకి ఉదృతంగా ప్రవహిస్తోంది. పండమేరు వాగు ఉద్ధృతితో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.