Cheetah. Representational Image. (Photo credits: Twitter/ANI)

నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుత పులులలో మరొకటి(సూరజ్‌) శుక్రవారం మృత్యువాత పడింది. గడిచిన ఐదు నెలల్లో ఇప్పటివరకు మొత్తం 7 చిరుత పులులు చనిపోగా సూరజ్ మృతితో ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది. దాని వయసు నాలుగు సంవత్సరాలు.నాలుగు రోజుల క్రితం మగ చిరుత తేజాస్ చనిపోయిన సంఘటన మరిచిపోక ముందే సూరజ్ చనిపోవడం కునో జాతీయవనం వర్గాలను కలవరపెడుతోంది. సూరజ్ మరణానికి కారణాలు ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మరొక చిరుత మృతి, కునో నేషనల్ పార్క్‌లో తేజస్ అనే మగ చిరుత చనిపోయిందని తెలిపిన అధికారులు

అంతకుముందు ఆడ చిరుత సియాయ(జ్వాల) నాలుగు చిరుత కూనలకు జన్మనివ్వగా అందులో రెండు చనిపోయిన సంగతి తెలిసిందే. అవి డీహైడ్రేషన్ కారణంగా చనిపోయాయని జాతీయ వనం సిబ్బంది తెలియజేశారు. తేజాస్ మాత్రం కొట్లాటలో గాయపడి చనిపోయింది. సూరజ్ మరణంతో ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో మొత్తం ఎనిమిది చనిపోగా కూనో నేషనల్ పార్కులో ప్రస్తుతం పది చిరుతలు మాత్రమే మిగిలున్నాయి.