New Delhi, August 21: దేశ రాజధాని ఢిల్లీలో రాజు అనే పారిశుద్ధ్య కార్మికుడు కోవిడ్-19 సోకి మృతి (Sanitation Worker Raju Dies) చెందాడు. కరోనా విపత్కర వేళ అండగా నిలిచిన అతని మరణంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Delhi Cm Arvind Kejriwal) చలించిపోయారు. రాజు ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించారు. కోటి రూపాయల చెక్‌ను (aRs 1 Crore Cheque) రాజు కుటుంబానికి సీఎం కేజ్రీవాల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేస్తూ రాజు చనిపోయాడని, ఇంతటి అంకిత భావం కలిగిన కోవిడ్ వారియర్స్ ఉండటం గర్వకారణమని కేజ్రీవాల్ చెప్పారు.
కార్మికుడ రాజును ఢిల్లీ సర్కార్ ఫ్రంట్‌లైన్ యోధుడిగా గుర్తించింది. బారా హిందూ రావు హాస్పిటల్‌లో రాజు విధులు నిర్వర్తించాడు. సఫాయి రాజు ఇంటికి వెళ్లిన సీఎం కేజ్రీవాల్.. అతని కుటుంబసభ్యులకు కోటి రూపాయల చెక్ ను అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. కరోనా వారియర్లపై గర్వంగా ఉందన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి సఫాయి కార్మికుడు ప్రజలకు సేవ చేసినట్లు సీఎం కేజ్రీ తెలిపారు. సఫాయి యోధుడి ఇంటికి వెళ్లి కోటి చెక్ అందజేసినట్లు చెప్పారు. ఈ సాయంతో అతని కుటుంబానికి కొంత ఊరట లభిస్తుందని ఆశిస్తున్నట్లు కేజ్రీ తెలిపారు. హోం క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం, దేశంలో తాజాగా 68,898 మందికి కోవిడ్-19, భారత్‌లో 29 లక్షలు దాటిన కరోనా కేసులు, దేశ రాజధానిలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కేసులు
Update by ANI
Delhi Chief Minister Arvind Kejriwal handovers a cheque of Rs 1 Crore to the family of Raju, a sanitation worker who died due to #COVID19 while carrying out his duties CM says, "He died while serving the people. We are proud of all such COVID warriors." pic.twitter.com/gcQGvI9QkU
— ANI (@ANI) August 21, 2020
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు సెరోలాజికల్ సర్వే తెలిపింది. ఢిల్లీలో 29.1 శాతం మంది ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు (వ్యాధి నిరోధక ప్రతిరక్షకాలు) వృద్ధి చెందినట్టు తెలిసింది. ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ గురువారం ఈ వివరాలను తెలియజేశారు. ఈనెల 1 నుంచి 7వ తేదీ మధ్య రెండో దఫా సెరో సర్వే జరిగిందని, దీంట్లోభాగంగా 15 వేల మంది నమూనాలను పరీక్షించినట్టు వివరించారు. 28.3 శాతం పురుషుల్లో, 32.2 శాతం మహిళల్లో యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు గుర్తించామన్నారు. జూలైలో నిర్వహించిన తొలి సెరో సర్వేలో దాదాపు 22 శాతం మందిలో యాంటీబాడీలను గుర్తించినట్టు జైన్ గుర్తుచేశారు. అంటే ఢిల్లీ ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే సహజ సామర్థం క్రమంగా పెరుగుతున్నట్లు తేలింది.