ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలన్నింటి చుట్టేస్తున్న సంగతి విదితమే దీని దెబ్బకు ఇప్పటికే పలు దేశాలు ఆంక్షల దిశగా అడుగులు వేశాయి.ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ (Bill Gates on Omicron) స్పందిస్తూ... ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని... ఇది ప్రతి ఇంటికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తన సన్నిహితులు కూడా చాలా మంది వైరస్ బారిన పడుతున్నారని తెలిపారు. ఈ ఒమిక్రాన్ మహమ్మారి వల్ల మనమంతా చెత్త దశను చూడవచ్చని అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్ నేపథ్యంలో తన హాలిడే ప్లాన్లను (Bill Gates cancels his holiday plans) కూడా రద్దు చేసుకున్నానని చెప్పారు.
చరిత్రలో అన్ని వైరస్ ల కంటే వేగంగా (We Could Be Entering Worst Part Of Pandemic) ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని బిల్ గేట్స్ అన్నారు. ఒమిక్రాన్ మనల్ని ఎంత అనారోగ్యానికి గురి చేస్తుందనేది ఇప్పటి వరకు తెలియదని... దాని గురించి పూర్తిగా తెలిసేంత వరకు ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పారు. ఎవరూ గుంపులుగా గుమికూడొద్దని సూచించారు. టీకాలు వేయించుకోవాలని, వ్యాక్సిన్ బూస్టర్ డోసు మరింత రక్షణను కల్పిస్తుందని చెప్పారు. కరోనాకు వ్యాక్సిన్లు బాగా పని చేస్తున్నాయని అన్నారు. అయితే 2022 నాటికి కరోనా మహమ్మారి ముగుస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు.
మహమ్మారి ప్రమాదకర దశలోకి ప్రవేశించవచ్చునని చెబుతూ.. ఆయన అందరినీ వ్యాక్సిన్లు వేయించుకోవాలని, అనవసర ప్రయాణాలు, పండుగలు జరుపుకోవడం వంటివి మానుకోవాలని కోరారు. కరోనా మిగతా వేరింట్ల కన్నా ఇది ప్రమాదకర వేరింయట్‌గా అవతరించవచ్చునని, ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తోందని అన్నారు.
గేట్స్ మంగళవారం ఒమిక్రాన్ గురించి ఒక ట్వీట్ చేశారు. అందులో “ప్రపంచమంతా సామాన్య స్థితికి చేరుకుంటుదని అందరూ అనుకుంటున్న సమయంలో.. మహమ్మారి అత్యంత ప్రమాదకర దశ వైపుకు వెళుతోంది. చాలా మంది నా స్నేహితులు ఒమిక్రాన్ బారిన పడ్డారు.. నేను కూడా నా హాలిడేస్‌ని రద్దు చేసుకున్నా. చరిత్రలో వెలుగుచూసిన అన్ని వైరస్‌ల కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. త్వరలోనే ప్రపంచంలోని అన్ని దేశాలలో ఇది ప్రవేశిస్తుంది” అని రాశారు.
Here's Bill Gates Tweets
Omicron is spreading faster than any virus in history. It will soon be in every country in the world.
— Bill Gates (@BillGates) December 21, 2021
మరొక ట్వీట్‌లో ఆయన ఒమిక్రాన్ వైరస్‌ని అందరూ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. “ఇంతకు ముందు వచ్చిన డెల్టా వేరింట్ కన్నా దీని ప్రభావం తక్కువగా ఉన్నా.. ఇది వ్యాప్తి చెందడంలో చాలా ప్రమాదకరంగా ఉంది. ‘ఒమిక్రాన్ వచ్చినా సీరియస్ కాదులే’ అని భ్రమలో ఉండొద్దు ఎందుకంటే దీని గురించి ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు. అందుకే మనం దీని గురించి జాగ్రత్తగా ఉండాలి. మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారిని 2022లో అంతం చేయొచ్చు” అని చెప్పారు.