New Delhi, OCt 07: మాజీ గవర్నర్ అశ్వని కుమార్ సిమ్లాలోని తన ఇంట్లో ఆత్మహత్య (Ex-CBI Chief Ashwani Kumar Dies by Suicide) చేసుకున్నారు. అశ్వనీ కుమార్ డిజిపి, సిబిఐ అధినేతగా కూడా ఇంతకుముందు పనిచేశారు. సిమ్లా ఎస్పీ మోహిత్ చావ్లా మాట్లాడుతూ మణిపూర్, నాగాలాండ్ మాజీ గవర్నర్ (Former Governor of Nagaland), సిబిఐ మాజీ డైరెక్టర్ అశ్వని కుమార్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా విషాదకరమని తెలిపారు.
అశ్విని కుమార్ ఆగస్టు 2006 నుండి జూలై 2008 వరకు హిమాచల్ ప్రదేశ్ డిజిపిగా పనిచేశారు. దీని తరువాత ఆయన సిబిఐ చీఫ్‌గా నియమితులయ్యారు. అశ్విని కుమార్ 2008 ఆగస్టు 2 నుండి 2010 నవంబర్ 30 వరకు ఈ పదవిలో ఉన్నారు.
కాగా గత కొంతకాలంగా ఆయన (Ashwani Kumar) డిప్రెషన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఐజిఎంసికి చెందిన పోలీసులు, వైద్యుల బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే సిమ్లా ఎస్పీ మోహిత్ చావ్లా ఈ సంఘటనను ధృవీకరించారు. అతను పోలీసు అధికారులకు రోల్ మోడల్ అని తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని ఇది షాకింగ్ వార్త అని అన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.