Guwahati December 15: కిలో టీ పౌడర్(Tea Powder) ఎంతుంటుంది.? మహా అయితే వెయ్యి రూపాయలు…కానీ అస్సాం(Assam Tea)లో వేలం వేసిన ఓ టీ పొడి ఏకంగా లక్ష పలికింది. అవును మీరు విన్నది నిజమే! టేస్ట్‌ లో అదరహో అనిపించే మనోహరి గోల్డ్ టీ(Manohari Gold Tea) ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది.

పొద్దున్నే టీ లేనిదే కొందరికి రోజు గడవదు. అలా ప్రతి ఒక్కరి జీవితాలతో పెనవేసుకున్న టీ(Tea) కోసం ఎంతైనా ఖర్చు చేసేవాళ్లుంటారు. అయితే అస్సాంలో జరిగిన టీ పొడి వేలంలో ఒక అరుదైన టీ పౌడర్ లక్ష పలికింది(Manohari Gold Tea sets record sells for whopping Rs. 99,999 per kg). భారత్‌లో దొరికే టీ పొడుల్లో అస్సాం టీ పొడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అక్కడ ఉత్పత్తయ్యే చాయ్‌ పొడికి మంచి డిమాండ్ ఉంటుంది.

ప్రతీ ఏటా అసాంలో పలు అరుదైన రకాలకు చెందిన టీ పొడులను పలు సంస్థలు వేలం వేస్తాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు మనోహరి గోల్డ్ టీ(Manohari Gold Tea) అనే చాయపత్తాను వేలం వేశారు. ఈ టీ పొడి రికార్డు ధర నమోదు పలికింది. వేలంలో కిలో టీ పొడి 99వేల 999కు అమ్ముడుపోయింది. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర.

Foods Avoid With Tea: టీ తాగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహార పదార్థాలు తినకండి, చాలా ప్రమాదంలో పడే చాన్స్ ఉంది...

మనోహరి గోల్డ్ టీ పొడి(Manohari Gold Tea)ని మనోహరి టీ ఎస్టేట్స్ ఉత్పత్తి చేసుంది. ఈ కంపెనీ నుంచి సౌరవ్ టీ ట్రేడర్స్ అనే సంస్థ లక్ష రూపాయలకు ఈ టీ పౌడర్‌ను కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు టీ పొడి కొనుగోలు, విక్రయాల్లో దేశంలోనే ఇది అత్యధిక ధర. పసుపు రంగులో ఉండి అద్భుతమైన రుచిని అందించే మనోహరి గోల్డ్‌ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని పేరుంది. 2019 జులైలో ఈ టీ పొడిని వేలం నిర్వహించగా ఈ పొడి కేజీ 50వేలకు అమ్ముడుపోయి రికార్డు నెలకొల్పింది. అయితే కొద్దిరోజులకే ఈ రికార్డు బద్దలైంది. గోల్డెన్‌ నెడ్డిల్స్‌ టీ తోపాటు గోల్డెన్‌ బటర్‌ఫ్లై టీ లు 75 వేలకు అమ్ముడుపోయాయి. ఈ రికార్డును ప్రస్తుతం మనోహరి గోల్డ్‌ టీ తిరగరాసింది.