జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 23న బుధుడు ఉదయం 10 గంటలకు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రోజు సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించడం ద్వారా కొన్ని జీవితాల్లో మార్పులు వస్తాయి. సూర్యుడు, బుధ గ్రహం సంయోగం కారణంగా ఈ మూడు రాశుల వారికి కష్టాలు పెరుగుతాయి. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తులారాశి- తులారాశి వారికి సూర్యుడు ,బుధ గ్రహ సంయోగ కారణంగా కొన్ని నష్టాలు కలుగుతాయి. యువతలో ఆత్మవిశ్వాసం పూర్తిగా తగ్గిపోతుంది. ఉద్యోగస్తుల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై అధికారుల నుండి ఇబ్బందుని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా కొంచెం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలకు వెళ్ళకండి.

Astrology: వారాహి మాతకు అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే

కర్కాటక రాశి- ఈ రాశి వారికి కొత్తగా వ్యాపారం చేయాలి. అనుకుంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ఇది సరైన సమయం కాదు. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో గొడవలు అవుతాయి. న్యాయపరమైన విషయాల్లో చిక్కుకు పోతారు దీని ద్వారా మానసిక ఆందోళన పెరుగుతుంది.

వృషభ రాశి- ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని ద్వారా ఖర్చులు అధికంగా అవుతాయి. రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉండదు. ఇంటి విషయాల్లో గొడవలు జరుగుతాయి. వ్యాపారం చేసే వారికి నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువుల్లో ఏకాగ్రతను ఏకాగ్రత తగ్గిపోతుంది. ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లకండి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.