అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ నెల 22న హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలన్నింటికి ఈ హాఫ్ హాలీడే వర్తించనున్నట్లు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో జరిగే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయ్యేంత వరకు ఒకపూట సెలవు వర్దిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు. 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా ‘జై శ్రీరామ్’ నినాదాలు వినిపిస్తున్నాయి.
Here's News
All central government offices across India will remain closed for half day on January 22, 2024 in view of Ram Lalla Pran Pratishtha ceremony at Ayodhya. pic.twitter.com/4Scs88RHxK
— Press Trust of India (@PTI_News) January 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)