Representative Image (Photo Credit- PTI)

బ్యాంకు పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవద్దు ఎందుకంటే వచ్చే ఆగస్టు నెల లో బ్యాంకులకు ఎక్కువగా సెలవులు వస్తున్నాయి. రాష్ట్రాల వారీగా ఈ సెలవులు మారాయి. స్థానిక పండగలు ఆయా రాష్ట్రాల్లో బ్యాంక్ సెలవులను నిర్ణయించడం జరుగుతుంది. ఆగస్టు, 2023లో బ్యాంకులు ఏకంగా 14 రోజుల పాటు పని చేయవని తెలుస్తోంది.

రెండో, నాలుగో శనివారాలు ఆదివారాలు అలానే పబ్లిక్ హాలిడేస్ రావడం తో మొత్తం 14 రోజుల పాటు మూతపడనున్నాయి. ఖాతాదారులు చివరి క్షణంలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఉండేందుకు బ్యాంకు సంబంధిత పనులను ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అయితే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మరియు ATMలు అన్ని సెలవు దినాల్లో దేశవ్యాప్తంగా పనిచేస్తాయి. ఇక మరి లిస్ట్ చూసేద్దాం..

ఈ నెల 27న రైతుల అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు, లిస్టులో మీ పేరు ఉందో లేదో ఈ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి

ఆగస్టు 6- ఆదివారం కనుక అన్ని చోట్ల సెలవే

ఆగస్టు 8- సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో టెండాంగ్ లో రమ్ ఫాట్ కారణంగా క్లోజ్

ఆగస్టు 12- రెండో శనివారం అన్ని చోట్ల సెలవే

ఆగస్టు 13- ఆదివారం అన్ని చోట్ల సెలవే

ఆగస్టు 15- స్వాతంత్య్ర దినోత్సవం అన్ని చోట్ల సెలవే

ఆగస్టు 16- పార్సీ నూతన సంవత్సరం కారణంగా ముంబై, నాగ్‌పూర్, బేలాపూర్‌లో బ్యాంకులకు సెలవు

ఆగస్టు 18- శ్రీమత శంకర్‌దేవ్ తిథి వలన అస్సాం గౌహతిలో సెలవు

ఆగస్టు 20- ఆదివారం అన్ని చోట్ల సెలవే

ఆగస్టు 26- నాలుగో శనివారం అన్ని చోట్ల సెలవే

ఆగస్టు 27- ఆదివారం అన్ని చోట్ల సెలవే

ఆగస్టు 28- మొదటి ఓనం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో సెలవు

ఆగస్టు 29- తిరుఓణం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో సెలవు

ఆగస్టు 30- రక్షా బంధన్

ఆగస్టు 31- రక్షా బంధన్/ శ్రీ నారాయణ గురు జయంతి/ పాంగ్- లాబ్సోల్ కారణంగా డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో సెలవు.