Indore, Jan 26: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన ఓ బ్యాంక్ మేనేజర్ దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మొహాలీకి చెందిన ఓ మైనర్‌కు స్నేహితురాలి ద్వారా మొహలిలో పనిచేస్తున్న 53 ఏళ్ల ఓ బ్యాంక్ మేనేజర్‌తో పరిచయమైంది. అతడు మైనర్‌ను అప్పుడప్పుడు షాపింగ్ తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు హోటల్ గదికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం (Bank manager rapes minor) చేశాడు. ఆ సంఘటనంతా వీడియో తీశాడు.
ఆ తర్వాత నుంచి వీడియో చూపించి గదికి రమ్మని బ్లాక్ మెయిల్ (records video to blackmail her) చేసేవాడు. దీంతో విసుగుచెందిన మైనర్ పోలీసులను ఆశ్రయించింది. బ్యాంక్ మేనేజర్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ తన స్నేహితురాలిపై కూడా కేసు పెట్టడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.
ఇక ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా ఎస్సై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బులంద్‌షహర్ ఎస్‌ఎస్‌పీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన 30 ఏళ్ల అర్జూ పవార్.. అనూప్‌షహర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో 2015 నుంచి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె షామ్లి జిల్లాలో ఒంటరిగా నివసిస్తోంది. అయితే గత కొంత కాలంగా ఆమెకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. దీంతో తీవ్రంగా కలత చెందిన సదరు మహిళ తను నివాసం ఉంటున్న ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది.
మరోవైపు ఇంటి యజమాని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో తలుపు తట్టి చూడగా లోపల నుంచి గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు పిలిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించి చూడగా ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. గదిలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. అందులో తన చావుకు తనే కారణమని పేర్కొంది