File Image of Bank Strike (Photo-PTI)

New Delhi, January 16:  బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) తో చర్చలు విఫలం కావడంతో బ్యాంక్ యూనియన్లు (UFBU) రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు (Nationwide Bank Strike)  పిలుపునిచ్చాయి. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు రోజులు జనవరి 31 మరియు ఫిబ్రవరి 1న బ్యాంక్ ఉద్యోగులు బంద్ పాటించి బ్యాంక్ ఉద్యోగులు తమ నిరసన తెలియజేయనున్నారు. మరోసారి మార్చి నెలలో కూడా మూడు రోజుల పాటు బంద్ పాటించనున్నట్లు ప్రకటించారు.

ముందస్తు వేతరణ సవరణ అంశం పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU)) పరిధిలోని తొమ్మిది ట్రేడ్ యూనియన్లు వరుసగా మూడు నెలల కాలంలో సమ్మె చేపట్టాలని తీర్మానించాయని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది.

నివేదికల ప్రకారం, బ్యాంక్ యూనియన్లు ఈ నెల జనవరి 31 న మరియు వచ్చే నెల ఫిబ్రవరి 1 న సమ్మెను పాటిస్తాయి. అలాగే మార్చి నెలలో 11, 12 మరియు 13 తేదీలలో మూడు రోజుల సమ్మెపై సమ్మెను నిర్వహించనున్నాయి. నవంబర్ 1, 2017 నుండి ముందస్తు వేతన సవరణ అంశం అపరిష్కృతంగానే కొనసాగుతుందని అసోసియేషన్ పేర్కొంది.

Here's the update: 

 

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ వేతన సవరణ అంశానికి సంబంధించి  మొన్న జనవరి 13న  ట్రేడ్ యూనియన్లతో బ్యాంక్స్ అసోసియేషన్ చర్చలు జరిపింది. బ్యాంక్ ఉద్యోగులు కనీసం 15 శాతం పెంపును కోరుతున్నారు, అయితే బ్యాంక్స్ అసోసియేషన్ మాత్రం 12.25 పెంపుదలకు అంగీకరించింది. అంతకుమించి పెంపుదల సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో  ట్రేడ్ యూనియన్లు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి.