New Delhi, JAN 28: డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు (Bank unions ) ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సమ్మె వాయిదా (strike) పడింది. ఐదు రోజుల పని విధానం, ఎన్పీఎస్ రద్దు, వేతన పెంపు సవరణ, అన్ని స్థాయిలో ఉద్యోగుల నియామకాల ప్రక్రియ, తదితర డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చాయి. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్‌తో చర్చలు ఫలప్రదం కావడంతో తాత్కాలికంగా సమ్మె వాయిదా వేసినట్లు తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ (UFBU) ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లపై బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ నెల 31న సమావేశం కావడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) అంగీకరించింది. దీంతో సమ్మె నిర్ణయం వాయిదా వేశామని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. దీంతో ఈ నెల 30,31 తేదీల్లో బ్యాంకులన్నీ యధావిధిగా సేవలందించనున్నాయి.
యూఎఫ్బీయూలో అఖిల భారత ఉద్యోగుల సంఘం (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్ (AIBOC), నేషనల్ కాన్ఫిడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్బీఓసీ), నేషనల్ ఆర్గనైజేసన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ఆర్గనైజేషన్ (ఎన్వోబీడబ్ల్యూ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్వోబీవో) సభ్యులుగా ఉన్నాయి.