Congress leader Raja Pateria (Photo/ANI)

Bhopal, Dec 12: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాజ పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పన్నా జిల్లా పొవైలో కార్యకర్తల సమావేశంలో ఆయన (Madhya Pradesh Congress Leader Raja Pateria) మాట్లాడుతూ..‘ప్రధాని మోడీ.. మతం, కులం, భాష ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోడీని చంపేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు.

డీమోనిటైజేషన్ మళ్లీ తెరపైకి, రూ.2000 నోట్లను దశల వారీగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ('Be Ready To Kill Modi') ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతున్నాయి.దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ మహాత్మా గాంధీకి చెందిన పార్టీ కాదని, ఇటలీ ముస్సోలిని పార్టీ అని తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ ఆయన సిద్ధాంతాలనే పాటిస్తోందని మధ్యప్రదేశ్ కమలం పార్టీ నేత నరోత్తమ్ మిశ్రా ధ్వజమెత్తారు.

డ్రమ్ము వాయించిన ప్రధాని మోదీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

అయితే తన ‍వ్యాఖ్యలపై రాజా పటేరియా వివరణ ఇచ్చారు. మోదీని లేకుండా చేయాలనేది తన ఉద్దేశం కాదని, ఎన్నికల్లో ఓడించాలనేదే తన మాటల్లోని అంతరార్థం అని చెప్పుకొచ్చారు. వీడియో తీసిన వ్యక్తి ఎవరో తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని పేర్కొన్నారు. మోదీని లేకుండా చేయడమంటే, అధికారం నుంచి గద్దె దించడమేనని వివరించారు.

Watch Video

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా పొవై పోలీస్ స్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్య చేసినందుకు ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజా పటేరియాపై ఎఫ్ఐఆర్ నమోదైంది.పటేరియాపై IPC సెక్షన్లు 451, 504, 505 (1)(బి), 505 (1)(సి), 506, 153-బి (1)(సి) సెక్షన్ల కింద బుక్ చేశారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు, అందులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నామని, చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పారు.

'భారత్ జోడో యాత్రలో నటిస్తున్న వారి నిజస్వరూపం వెలుగులోకి వస్తోంది. ప్రధాని మోదీ ప్రజల గుండెల్లో నివసిస్తున్నారు. ఆయన యావత్ జాతి విశ్వాసానికి కేంద్రంగా ఉన్నారు' అని కాంగ్రెస్‌పై సీఎం చౌహాన్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌వాళ్ళు తనను రంగంలోకి దించలేదు, మోడీ హత్య గురించి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నాడు. ఇది ద్వేషం యొక్క ఔన్నత్యం. కాంగ్రెస్ యొక్క నిజమైన భావాలు బయటపడుతున్నాయి, అయితే ఇలాంటివి సహించబోవు" అని ఆయన అన్నారు.