Jagdeep Dhankhar: ఏన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్ధి ఖరారు, అనూహ్యంగా తెరపైకి బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ పేరు, అనేక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఎంపిక, ధన్‌కర్ గురించి తెలుసుకోండి?

New Delhi, July 16: ఎన్డీయే తరుపున ఉపరాష్ట్రపతి(Vice Presidential Candidate) అభ్యర్ధి పేరు ఖరారైంది. ఎన్నో పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ...చివరికి బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్(Jagdeep Dhankhar) ను తమ అభ్యర్ధిగా ప్రకటించారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda). బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బోర్డు సమావేశంలో ప్రధాని మోదీతో పాటూ కేంద్రమంత్రులు అమిత్ షా(Amith shah), రాజ్‌నాథ్ సింగ్, ఇతర బీజేపీ కీలక నేతలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. జగదీప్ ధన్‌కర్ ప్రస్తుతం బెంగాల్ గవర్నర్‌ గా ఉన్నారు. గతకొద్దిరోజులుగా మమతా బెనర్జీతో ఆయన ఢీ అంటే ఢీ అంటున్నారు. వచ్చే నెల 10తో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah naidu) పదవీకాలం ముగుస్తోంది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19వరకు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించనున్నారు.

కొత్త‌ ఉప రాష్ట్రపతిని 788 మంది లోక్ సభ, రాజ్యసభ స‌భ్యులు ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. పోటీ అనివార్యం అయితేనే ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జ‌రుగుతుంది. అయితే జ‌గ‌దీప్ స్వ‌స్థ‌లం రాజ‌స్థాన్‌(Rajasthan). ఆయ‌న కెరీర్ మొద‌ట్లో సుప్రీంకోర్టు న్యాయ‌వాదిగా ప‌నిచేశారు. మాజీ ప్ర‌ధాని చంద్ర‌శేఖ‌ర్ సింగ్ హ‌యాంలో కేంద్ర స‌హాయ మంత్రిగానూ ప‌నిచేశారు. రెండు దశాబ్దాలుగా ఆయనకు బీజేపీతో అనుబంధం ఉంది. బెంగాల్ ఎన్నికల సమయంతో పాటూ, ఇటీవల యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల విషయంలో ఆయన చురుగ్గా వ్యవహరించారు.

Rupee Dollar: వచ్చే వారం రూపాయి మరింత పతనం అయ్యే చాన్స్, డాలర్ కు ప్రతిగా రూపాయి రూ.80 దాటేసే చాన్స్, ఎందుకు ఇలా జరుగుతోంది.. 

జాట్(JAT) సామాజిక వర్గానికి చెందిన జగదీప్ దన్‌కర్ ను తమ అభ్యర్ధిగా ఎంపిక చేయడం ద్వారా వెస్ట్ యూపీలో జాట్ లకు దగ్గర కావొచ్చని, రాజస్థాన్ లోనూ తమ బలం పెరుగుతుందని బీజేపీ భావిస్తోంది. పైగా వ్యవసాయ చట్టాల వల్ల బీజేపీపై జాట్లు ఆగ్రహంగా ఉన్నారు. ఇది భవిష్యత్‌లో ప్రభావం చూపించకుండా ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.

Earthquake In Gujarat: గుజరాత్ లో భూకంపం, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదు, భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం  

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్ధి రేసులో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ(Mukthar abbas naqvi) పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన ఇటీవల కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఊహానాలు మరింత ఊపందుకున్నాయి. ఆ తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్(amrinder singh) పేరును కూడా పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో పాటూ గులాంనబీ ఆజాద్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్రమాజీ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ వంటి పేర్లు మీడియాలో ప్రచారం జరిగాయి. కానీ జగదీప్ ధన్‌కర్ ను ఎంపిక చేసి అనూహ్య నిర్ణయం తీసుకుంది బీజేపీ.