Malda, Nov 19: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ పేలుడు (Bengal Plastic Factory Blast) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో (Malda district) ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం భారీ పేలుడు( plastic factory Blast in West Bengal) సంభవించింది. ఈ ప్రమాదంలోఅయిదుగురు అక్కడిక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరిన రక్షక బృందాలు,అగ్నిమాపక బృందాలు, సహాయక చర్యల్ని పర‍్యవేక్షిస్తున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి.
ఉదయం 11 గంటల సమయంలో సుజాపూర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భారీ పోలీసు బృందాలను పంపించామన్నారు. అగ్నిమాపక శకటాలు మంటలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాయనీ, ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు.
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు, గాయపడిన వారికి రూ .50 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వ కార్యదర్శి అలపన్ బండి యోపాధ్యాయ ప్రకటించారు. పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించనున్నారని తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఒక ప్లాస్టిక్ కర్మాగారంలో గురువారం జరిగిన పేలుడులో మా వ్యక్తులు మరణించారు మరియు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 11 గంటల సమయంలో సుజాపూర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.