Crime | Representational Image (Photo Credits: Pixabay)

Bengaluru, March 26: హాయిగా సాగిపోయే జీవితంలో అక్రమ సంబంధం ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో, చివరకు అది ఒక పచ్చని కుటుంబాన్ని ఎంతగా చిన్నాభిన్నం చేస్తుందో చెప్పే ఘటన ఇది. బెంగళూరులో గురువారం జరిగిన ఒక ఘటన స్థానికంగా షాక్ కు గురి చేస్తుంది. అక్రమసంబంధం పెట్టుకున్న తన భార్య యొక్క ప్రియుడిని తన ఇంట్లోనే మాటువేసి మరీ చంపాడు ఒక వ్యక్తి.

వివరాల్లోకి వెళ్తే, బెంగళూరులోని నేలమంగళ ప్రాంతంలో నివాసం ఉండే 31 ఏళ్ల భరత్ కుమార్ కు 8 ఏళ్ల క్రితం వినూత అఏ యువతితో వివాహం అయింది, వారికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే మూడేళ్ల కిందట వినూత గ్రామానికే చెందిన శివకుమార్ అనే 27 ఏళ్ల యువకుడు జాబ్ వెతుక్కోవటానికి బెంగళూరు వచ్చాడు. ఈ క్రమంలోనే తనకు పరిచయం ఉన్న వినూత సహాయం కోరాడు, వినూత భర్త అనుమతితో వాళ్లింట్లోనే శివకుమార్ ఒక వారం రోజుల పాటు ఆశ్రయం పొందాడు. వినూత అతడికి ఒక ఉద్యోగం కూడా వెతికి పెట్టింది.

అప్పట్నించి శివకుమార్ తరచూగా వినూత ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ప్రేమిస్తున్నానంటూ వినూతపై ఒత్తిడి తీసుకొచాడు. మొదట్లో వినూత ఒప్పుకోలేదు కానీ శివకుమార్ ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటంతో వినూత కూడా అతడికి దగ్గరైంది. అది వారి అక్రమ సంబంధానికి దారితీసింది. తన భార్య అక్రమసంబంధాన్ని గుర్తించిన భర్త భరత్ కుమార్ ఈ విషయమై భార్యతో గొడవపడ్డాడు. దీంతో వినూత భర్త నుంచి వేరుపడి అంద్రహల్లీ అనే ప్రాంతంలో ఒంటరిగానే నివసించడం ప్రారంభించింది. ఆమె వద్దకు శివకుమార్ వారానికి 2-3 సార్లు వచ్చి గడిపేవాడు.

ఇదంతా చూసి భరించలేని వినూత భర్త భరత్, తన సంసార జీవితాన్ని నాశనం చేసిన శివకుమార్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు. మొన్న మార్చి 24న వినూత ఉండే ఇంటి వద్దనే రెక్కి నిర్వహించి, ఆమె చికెన్ తీసుకురావడానికి బయటకు వెళ్లినపుడు రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడి బెడ్ రూంలోని మంచం కింద దాక్కున్నాడు. ఇక ఆ తర్వాత వినూత వచ్చి వంట చేసింది, కొద్ది సేపటికి ప్రియుడు శివకుమార్ కూడా వచ్చాడు. వారిద్దరూ డిన్నర్ చేసి అదే బెడ్ మీద పడుకున్నారు, కింద చప్పుడు చేయకుండా ఉన్న భరత్ చివరకు అర్ధరాత్రి 3 గంటలకు భార్య వినూత బాత్రూంకి వెళ్లడం గమనించి అప్పుడు సుమారు 6 గంటల తర్వాత మంచం కింద నుంచి బయటకు వచ్చాడు. వినూతను బెత్రూంలోనే గడియపెట్టి మంచం మీద సుఖంగా నిద్రపోతున్న శివకుమార్ మీద దాటి చేశాడు అతడు ప్రతిఘటించటంతో భరత్ తాను వెంట తెచ్చుకున్న కత్తితో శివకుమార్ పొట్ట భాగంలో మూడు పోట్లు పొడిచాడు. దీంతో శివకుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి ఎక్కడైనా పాతిపెడదామనుకొని మొదట్లో భావించిన భరత్ కానీ, జరిగిన విషయాన్నంతా బంధువులకు చెప్పి, వాళ్ల ద్వారా పోలీసులకు తెలియపరిచాడు. తెల్లవారుఝామున 4 గంటలకు పోలీసులు చేరుకొని భరత్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.