Bangalore December 02: బెంగళూరు(Bangalore)లో ఒమిక్రాన్(Omicron) వేరియంట్ సోకిన వ్యక్తితో ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న ఐదుగురికి కరోనా పాజిటివ్(Corona Positive)గా తేలింది. దీంతో వారి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్(Genome Sequencing ) కోసం పంపించారు. అయితే ఒమిక్రాన్(Omicron) నిర్ధారణ అయిన వ్యక్తి ఒక డాక్టర్ అని కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ప్రకటించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…ఆ డాక్టర్ ఇటీవల విదేశాలకు వెళ్లలేదు. దీంతో ఆయన ఒమిక్రాన్ ఎలా సోకిందన్నది మిస్టరీగా మారింది.
బెంగళూరుకు చెందిన 46 ఏండ్ల వైద్యుడి(Doctor)కి నవంబర్ 21న జ్వరం, వంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో మరుసటిరోజు ఆయన కరోనా పరీక్ష(Corona Test) చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. అదే రోజున అతడు ఆసుపత్రిలో చేరారని, మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు.
ఆ వైద్యుడి నమూనాను నవంబర్ 22న జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా ఒమిక్రాన్ వేరియంట్‌గా గురువారం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన ఇటీవల ఏ విదేశాలకు ప్రయాణించలేదన్నారు. ఆ వైద్యుడితో ప్రైమరీ కాంటాక్ట్ గా ఉండి పాజిటివ్ గా తేలిన 5 గురిని ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంచారు.