 
                                                                 Bengaluru, Dec 23: కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ పట్ల ఆదివారం రాత్రి అభ్యంతరకరంగా వ్యవహరించాడు. ఈ ఘటన వీడియో ద్వారా బయటకు రావడంతో అమృతహళ్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ (Policeman Suspended) చేశారు. వైరల్ వీడియో ప్రకారం యలహంక న్యూ టౌన్ వద్ద వీధికుక్కలకు ఆహారం తినిపిస్తున్న యువతి (26) పట్ల హెడ్ కానిస్టేబుల్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడు.
బాధితురాలు తన ఇంటి వద్ద వీధికుక్కలకు ఆహారం తినిపిస్తున్న సమయంలో యలహంక న్యూటౌన్ సమీపంలోని పోలీస్ క్వార్టర్స్‌లో నివసించే నిందితుడు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ఆమెవైపు చూస్తూ తన మొబైల్ టార్చ్‌లైట్ స్విచాన్ చేసి తన ప్యాంట్ జిప్ వద్ద ప్రైవేట్ పార్టును చూపుతూ ఫ్లాష్ (Flashing Private Parts to a Woman) చేశాడు. దీంతో ఆ సమయంలో మహిళ అటుగా వెళుతున్న వ్యక్తిని హెడ్ కానిస్టేబుల్ చర్యను ఫోన్‌లో రికార్డు చేయాలని కోరింది.
నిందితుడి దుశ్చర్యను అతడు రికార్డు చేస్తుండగా వీడియోను డిలీట్ (Video Delete) చేయాలని నిందితుడు బెదిరించాడు. తాను హెడ్‌కానిస్టేబుల్‌నని తనను ఎవరూ ఏమీ చేయలేరని రెచ్చిపోయాడు.
ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో కీచక కానిస్టేబుల్‌పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఈ వీడియోతో చంద్రశేఖర్ బిఎన్ అనే హెడ్ కానిస్టేబుల్‌పై మహిళ ఫిర్యాదు చేసింది. నిందితుడు చంద్రశేఖర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. పోలీసులు హెడ్ కానిస్టేబుల్‌పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 509 మరియు సెక్షన్ 354A కింద కేసు నమోదు చేశారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
