Bengaluru, May 12: కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా దేశంలో పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలురైళ్లను నడుతున్నా అనుమతులు లభించక చాలామంది కార్మికులు సొంత ఊరు వెళ్లేందుకు పడిగాపులు గాస్తున్నారు. పాసుల కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్లగా పలుచోట్ల వలస కార్మికులపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. నాలుగవ దశ లాక్‌డౌన్, ఈ నెల 15 లోగా రాష్ట్రాల సీఎంలు తమ అభిప్రాయాలు చెప్పాలన్న ప్రధాని మోదీ, వీడియో కాన్ఫరెన్స్‌లో ఎవరేమన్నారంటే..
తాజాగా బెంగుళూరులో ఓ పోలీస్ (Bengaluru Police) వలస కార్మికులపై ప్రతాపం చూపించాడు. తాము స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి కావాలంటూ బెంగుళూరులోని కేజీ హోలీ పోలీస్ట్ స్టేషన్‌కు (KG Halli Police Station) వెళ్లిన కార్మికులపై ఏఎస్ఐ దుశ్చర్యకు (Bengaluru Policeman Thrashes Migrant Workers) పాల్పడ్డారు. కార్మికుడిపై చేయి చేసుకోవడమే కాకుండా బూటుకాలితో తన్ని పరిగెత్తించారు. ఈ వీడియోకాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా (Video Goes Viral) మారడంతో ఉన్నతాధికారులు స్పందించి అతన్ని విధుల్లోనుంచి తొలగించారు.
Bengaluru policeman Beat Migrants:
KG Halli —in Bengaluru—ASI slaps, kicks #migrants seeking details. The video is from yesterday. He has since been suspended. The migrants were said to be from UP, reports @KiranParashar21. #lockdown #COVID19 pic.twitter.com/skYoIpFIpl
— Chethan Kumar (@Chethan_Dash) May 11, 2020
సోమవారం జరిగిన ఈ ఘటనపై సీనియర్ పోలీస్ అధికారి ఎస్‌డీ శరనప్ప మాట్లాడుతూ.. ‘ఉత్తర ప్రదేశ్‌కి చెందిన కొంతమంది వలస కూలీలు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తాము స్వస్థలాలకు వెళ్లేందుకు పాసులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలోనే ఏఎస్‌ఐ రాజా సాహెబ్ వారిపై చేయి చేసుకుని బూటుకాలితో తన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు ఏఎస్‌ను సస్పెండ్ చేశాము’ అని వివరించారు.