Bengaluru Rains. (Photo Credits: IANS)

Bengaluru, Oct 12: క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు సోమ‌వారం రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. దీంతో బెంగ‌ళూరు సిటీ జ‌ల‌మ‌యం అయింది. లోత‌ట్టు ప్రాంతాల్లోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. భారీవర్షాల వల్ల బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Kempe Gowda International Airport Flooded) వెళ్లే రహదారులు జలమయమయ్యాయి.వందలాది టాక్సీలు, ప్రైవేట్ వాహనాలు విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో చిక్కుకుపోయాయి.దీంతో ప్రయాణికులు టెర్మినల్స్‌లోకి (Travellers Face Harrowing Time) ప్రవేశించలేకపోతున్నారు.

ఎలాంటి మార్గం లేకపోవడంతో ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవడానికి ట్రాక్టర్ రైడ్ చేయాల్సి వచ్చింది. విమానాశ్రయానికి విమాన ప్రయాణికులు ట్రాక్టర్లపై వెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐటీ హబ్‌లోని కోనప్పన అగ్రహార పరిసరాల్లోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.

5జీ రాకముందే ఇండియాలో 6జీ టెక్నాలజీ, వెంటనే పనులు ప్రారంభించాలని సీ-డాట్‌ను కోరిన కేంద్రం, బీఎస్ఎన్‌ఎల్‌ 4జీ టెక్నాలజీతో తొలి కాల్‌ చేసిన టెలికాం కార్యదర్శి కే రాజారామన్‌

బెంగళూరులో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురవవచ్చని వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ కూడా బెంగ‌ళూరు సిటీలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

నీట మునిగిన బెంగ‌ళూరు విమానాశ్రయం వీడియో 

కర్ణాటకలో తూర్పు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. బెంగళూరులో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.