బెంగళూరు, డిసెంబర్ 8: హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఓ మహిళా టీచర్ విద్యార్థినిపై ఇనుప రాడ్‌తో దాడి చేసిన ఘటన బెంగళూరులో శుక్రవారం వెలుగు చూసింది. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని తీవ్ర గాయాలతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఈ దాడిలో విద్యార్థికి తీవ్ర రక్తస్రావమై చేతికి ఆరు కుట్లు పడ్డాయి.డిసెంబరు 5న ఈ ఘటన జరగడంతో స్కూల్ యాజమాన్యం విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా చూసేందుకు ప్రయత్నించింది.
బెంగళూరులోని లార్డ్స్ స్కూల్ విద్యార్థిపై టీచర్ దాడి చేసినట్లు ఫిర్యాదు అందిందని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో) షాహికల మీడియాకు తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులను పంపించి పాఠశాలకు నోటీసులు కూడా జారీ చేశారు.ఈ విషయంపై మీడియా పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించడం ప్రారంభించడంతో, యాజమాన్యం విద్యార్థి వైద్య ఖర్చులను భరించడానికి అంగీకరించిందని మరియు పాఠశాల మరియు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని తల్లిదండ్రులను ఒప్పించిందని వర్గాలు తెలిపాయి.