Representational Image (Photo Credits: Pixabay)

Betul, July 30: మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌ జిల్లాలో దారుణమైన సంఘటన వెలుగుచూసింది. చపాతీల్లో విషం కలిపి జిల్లా జడ్జి, ఆయన కుమారుడిని (Betul's Judge Death Case) ఓ మహిళ చంపేసింది. ఈ కేసులో ఆమెతో సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెతుల్ జిల్లా కోర్టు జడ్జి త్రిపాఠికి (Betul District Judge Mahendra Kumar Tripathi) గతంలో చింద్వారాలో పనిచేసిన సమయంలో అక్కడ ఎన్జీవోను నిర్వహించే మహిళ సంధ్యా సింగ్‌ (45)తో పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరూ సన్నిహితంగా మెలిగారు. అయితే న్యాయమూర్తి కుటుంబం (Mahendra Kumar Tripathi Family) బెతుల్‌లో కలిసి నివసిస్తుండటం వల్ల సంధ్యా సింగ్‌ జడ్జి త్రిపాఠీని కలుసుకోలేకపోయారు. దీంతో ఆమెకు ఆయన మీద పగ ఎక్కువైంది.

త్రిపాఠీ కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలనే కసితో ఆమె రగిలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయమూర్తి కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా పూజ చేస్తానని ఈనెల 20న త్రిపాఠీని నమ్మబలికిందిజ అందుకోసం తాంత్రిక్‌ బాబా రామ్‌దయాళ్‌ ను త్రిపాఠీకి పరిచయం చేసింది. ఇక పూజ చేసేందుకు గోధుమ పిండిని తీసుకురావాలని జడ్జిని కోరింది. ఆ తర్వాత గోధుమ పిండిని ఆయనకు ఇవ్వగా మహిళ ఇచ్చిన గోధుమపిండితో చేసిన చపాతీలను తిన్న న్యాయమూర్తి త్రిపాఠి, ఆయన కుమారుడు అస్వస్థతకు లోనయ్యారు. కరోనా బిల్లు ఇచ్చిన షాక్, ఆఫీసును కోవిడ్‌-19 ఆస్పత్రిగా మార్చేశాడు, మనవరాలు ‘హిబా’ పేరుతో ఆస్పత్రిని ఏర్పాటు చేసిన సూరత్ వ్యాపారి

వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా ఈనెల 25న తండ్రీ, కుమారులు మరణించారు. చపాతీలను తిన్న రెండో కుమారుడు సైతం అస్వస్ధతకు గురై చికిత్స పొందుతున్నారు. త్రిపాఠి భార్య ఆ రోజు చపాతీలు తినకుండా రైస్‌ తీసుకోవడంతో బతికిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు సంధ్యా సింగ్‌ ఆమె డ్రైవర్‌ సంజూ, ఆమెకు సహకరించిన దేవీలాల్‌ చంద్రవంశి, ముబిన్‌ ఖాన్‌, కమల్‌లను అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న తాంత్రిక్‌ బాబా రామ్‌దయాళ్‌ కోసం గాలిస్తున్నారు