Bharat bandh today Nationwide protests against SC ruling on reservations(X)

Delhi, Aug 21:  ఇవాళ భారత్ బంద్. ఎస్టీ, ఎస్టీ రిజర్వేషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బంద్ జరగనుంది. దళిత, ఆదివాసీ సంస్థలు ఈ భారత్‌ బంద్‌కు మద్దతివ్వగా రాజస్థాన్‌లోని ఎస్సీ, ఎస్టీ సంఘాలు మద్దతు ప్రకటించాయి.

కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఎన్న ఎస్సీ , ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలలో కులాలను ఉప కులాలుగా విభజించి రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలదేనని సుప్రీం చెప్పిన సంగతి తెలిసిందే.

దీనిని నిరసిస్తూ ఇవాళ బంద్‌కు పిలుపునివ్వగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సమానత్వం, న్యాయం కల్పించాలని ఈ సందర్భంగా రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి కోరింది. రిజర్వేషన్లపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఎస్సీ, ఎస్టీలకు సంక్రమించిన రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందని అభిప్రాయపడింది.

ప్రధానంగా ఈ బంద్ ఎఫెక్ట్ రాజస్థాన్‌, యూపీలో ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలను మోహరించారు. ఆగస్ట్ 21న భారత్ బంద్, ఏవి తెరిచి ఉంటాయి, ఏ సేవలు నిలిపివేయబడతాయి, భారత్ బంద్ ఎందుకు చేస్తున్నారు..పూర్తి వివరాలు ఇవిగో..

ఈ బంద్ నుండి అత్యవసర, అంబులెన్స్ సేవలు, వైద్య సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆందోళన చేసే మాల సామాజిక వర్గం నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు పోలీసులు. కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ముందుగానే బంద్ కు సంఘీభావంగా సెలవు ప్రకటించాయి.