nationwide general strike called by central trade unions (Photo-PTI)

New Delhi, May 28: వివిధ రంగాల్లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల భారత్ బంద్‌ చేపట్టారు. భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల సంయుక్త వేదిక పిలుపు మేర బంద్ కు (Bharat Bandh) మిశ్రమ స్పందన లభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ యోచన, బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి నిరసనగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమ్మెకు మద్దతు ఇచ్చింది.

ఫలితంగా రెండు రోజులు బ్యాంకుల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండవు. ‘సోమ, మంగళవారాల్లో (Bharat Bandh today, tomorrow) బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం ఏర్పడవచ్చు’ అని ఎస్బీఐ సహా అనేక బ్యాంకులు తెలిపాయి. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొంటున్నట్టు పేర్కొన్నాయి. బ్యాంకు ఉద్యోగులతో పాటు ఉక్కు, చమురు, టెలికం, బొగ్గు, పోస్టల్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొననున్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో కలిపి మొత్తం 20 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని అంచనా. బంద్‌ కారణంగా బ్యాంకింగ్‌, రవాణా, రైల్వే, విద్యుత్తు సర్వీసులపై ప్రభావం ( Banking, transport, other services may be hit) పడనున్నది.

దేశంలో కొత్త‌గా 1,270 మందికి కరోనా, ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 15,859 కేసులు యాక్టివ్‌

బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, ఆదాయ పన్ను, బ్యాంకులు, బీమా రంగాల కార్మిక సంఘాలు సమ్మె నోటీసులివ్వగా రైల్వే, రక్షణ రంగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రైవేటీకరణ చర్యలను, కార్మిక చట్టాల మార్పులను వెనక్కి తీసుకోవాలన్నది వీటి డిమాండ్‌. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని, కాంట్రాక్ట్‌ సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలని కూడా కోరుతున్నాయి. సమ్మె నేపథ్యంలో జాతీయ గ్రిడ్‌లో విద్యుత్‌ సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర విద్యుత్‌ శాఖ సూచించింది. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది.

పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఇప్పటివరకు రెండు రోజుల భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. ఫ్యాక్టరీల దగ్గర కొన్ని చోట్ల వామపక్ష సంస్థలు బంద్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ జెండాలు ఊపుతూ కనిపించారు. మార్చి 28, 29 తేదీలలో 48 గంటల దేశవ్యాప్త సమ్మె సందర్భంగా తమ ఉద్యోగులందరినీ విధులకు హాజరు కావాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరింది, లేని పక్షంలో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని సర్కారు హెచ్చరించింది.బీజేపీ, టీఎంసీ పార్టీలు మినహా లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్‌తో సహా అనేక కార్మిక సంఘాలు కేంద్ర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.సమ్మె కారణంగా బ్యాంకింగ్‌ సేవలు దెబ్బతినే అవకాశం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

తగ్గేదేలే అంటున్న ఇంధన ధరలు, గత వారం రోజుల్లో ఆరుసార్లు పెంపు, తాజాగా పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరుగుదల

సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్టు టీఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధానకార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం నిర్ణయించింది. బీఎంఎస్‌ మినహా రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగ సంఘాలన్నీ ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేసి వాటిని బలోపేతం చేయాలని, మొండిబకాయిల (ఎన్‌పీఏ) సత్వర రికవరీకి చర్యలు తీసుకోవాలని, ఖాతాదారులపై సర్వీస్‌ చార్జీల భారం తగ్గించాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని బ్యాంకు యూనియన్‌ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం స్పష్టం చేశారు. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐసహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు సమ్మె కారణంగా తమ సేవలకు పాక్షిక అంతరాయం కలగవచ్చని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి.

కాగా, బుధవారం కూడా కస్టమర్లకు బ్యాంకింగ్‌ సేవల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. 2021–22కు సంబంధించి ప్రభుత్వ ఖాతా లావాదేవీల వార్షిక ముగింపు ప్రక్రియలో పాల్గొనాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించడం దీనికి నేపథ్యం. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే నిర్దిష్ట (ఏజెన్సీ) బ్యాంకు బ్రాంచీలు ఆయా లావాదేవీలను తప్పనిసరిగా అదే ఆర్థిక సంవత్సరంలో ముగించాల్సిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీతో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ ప్రత్యేక ఆదేశాలతో ఆర్థిక సంవత్సరం చివరిరోజు గురువారం నిర్దిష్ట బ్యాంక్‌ బ్రాంచీలు ప్రభుత్వ చెక్కుల క్లియరెన్స్‌ను చేపడతాయి.

ట్రేడ్‌ యూనియన్ల డిమాండ్లు

కార్మిక చట్టాలకు సవరించిన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి.

ప్రైవేటీకరణను ఆపాలి.

నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ను రద్దు చేయాలి.

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలి.

కాంట్రాక్టు వర్కర్లను రెగ్యులరైజ్‌ చేయాలి. బ్యాంకు ఉద్యోగుల సంఘం డిమాండ్లు

బ్యాంకుల ప్రైవేటీకరణ మానుకోవాలి.

ప్రభుత్వ బ్యాంకుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి.

సిబ్బందికి పాత పెన్షన్‌ స్కీమ్‌ను పునరుద్ధరించాలి

అప్పులను వేగంగా రికవరీ చేయడానికి చర్యలు తీసుకోవాలి.

వినియోగదారులపై సర్వీసు చార్జిని తగ్గించాలి.