Bharti Airtel. (Photo Credits: Twitter)

New Delhi, February 17: ఏజీఆర్ కేసులో  (AGR Case) సుప్రీంకోర్ట్ (Supreme Court)  ఆగ్రహం, కేంద్రం ఆదేశాలతో దిగివచ్చిన ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel Bharti Limited)  ఏజీఆర్ ఛార్జీల బకాయిల్లో (AGR Dues) భాగంగా రూ. 10,000 కోట్లను టెలికాం శాఖకు సోమవారం చెల్లించింది. మిగతా మొత్తాన్ని త్వరలోనే చెల్లిస్తామని వెల్లడించింది.

భారతి ఎయిర్‌టెల్‌లో విలీనం అయిన టెలినార్ ఇండియాకు సంబంధించి బకాయిల్లో రూ. 9500 కోట్లు చెల్లించాము మరియు భారతి హెక్సాకోమ్ తరపున మరో రూ. 500 కోట్ల రూపాయలు చెల్లించినట్లు భారతీ ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

తాజా చర్యతో దేశీయ స్టాక్ మార్కెట్లో ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు 0.69 శాతం తగ్గి 561.10 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

Check ANI Update:

ఏజీఆర్ ఛార్జీల చెల్లింపుల విషయంలో టెలికాం ఆపరేటర్లు కోర్ట్ ఉత్తర్వులను ధిక్కరించాని గత శుక్రవారం సుప్రీంకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పే అప్ ఆర్డర్ ఎందుకు పాటించలేదని టెలికాం ఆపరేటర్లపై సుప్రీం ధర్మాసనం కన్నెర్ర చేసింది. ఈ క్రమంలో టెలికాం సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లకు ధర్మాసనం సమన్లు జారీచేసింది. టెలికాం ఆపరేటర్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన టెలికాం శాఖ డెస్క్ ఆఫీసర్ పై కూడా సుప్రీం తీవ్రంగా మండిపడింది.  దేశంలో అసలు న్యాయం అంటూ ఉందా లేదా? అని న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో,   దిద్దుబాటు చర్యలు చేపట్టిన కేంద్రం,  రాత్రికిరాత్రే ఏజీఆర్ బకాయిలన్నింటినీ చెల్లించాలంటూ భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, టాటా టెలిసర్వీసెస్ తదితర ఆపరేటర్లకు ఆదేశాలు జారీచేసింది.

టెలికాం ఆపరేటర్లు మొత్తంగా రూ. 1.47 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి బకాయి పడ్డాయి. ఇందులో భాగంగా లైసెన్స్ ఛార్జీలు, స్పెక్ట్రమ్ ఫీజు, వడ్డీ కలిపితే ఎయిర్‌టెల్ రూ. 35,586 కోట్లు చెల్లించాల్సి ఉందని టెలికాం శాఖ పేర్కొంది. ఈనేపథ్యంలో ఈరోజు రూ. 10 కోట్లను ఎయిర్‌టెల్ ఈరోజు చెల్లించింది.