
Mumbai, September 23: మాటలకందని మహా విషాదం, తెలతెలవారుతుండగానే బతుకులు సమాధుల్లోకి వెళ్లాయి. మూడంతస్థుల భవనం కుప్పకూలి (Bhiwandi Tragedy) వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచివేసింది. మహారాష్ట్రలోని బీవండీ నగరంలో కుప్పకూలిన భవనం దుర్ఘటనలో బుధవారం నాటికి మృతుల సంఖ్య 39కు (Bhiwandi Building Collapse) పెరిగిందని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సు ఫోర్సు వెల్లడించింది. మృతుల్లో జుబేర్ ఖురేషి, ఫైజా ఖురేషీ, అయేషా ఖురేషి, సిరాజ్ అబ్దుల్ షేక్, ఫాతిమా జుబేరా, సిరాజ్ అహ్మద్ షేక్ తదితరులున్నారని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు.
బీవండీలోని పటేల్ కాంపౌండులోని నాలుగు అంతస్తుల భవనం సోమవారం తెల్లవారుజామున 3.40 గంటలకు కుప్పకూలిపోయింది. కుప్పకూలిన భవనం వద్ద ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు బృందాలు శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికితీశారు. బీవండీ నగరంలోని 21 ఫ్లాట్లు ఉన్న జిలానీ అపార్టుమెంటు సగం ఆదివారం తెల్లవారుజామున 3.40 గంటలకు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఫ్లాట్ల నివాసులు గాఢ నిద్రలో ఉన్నారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 39 మంది మరణించారు. మూడు అంతస్తుల 69వ నంబరు జిలానీ అపార్టుమెంటును 1984వ సంవత్సరంలో నిర్మించారు. బీవండీ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీలు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
43 ఏళ్లనాటి ఈ శిథిల భవనం ప్రమాదకరమైందంటూ భివండీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. 40 ఫ్లాట్లున్న ఈ భవనంలో 150 మంది వరకు నివాసం ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల సాయం ప్రకటించింది.
అధికారులు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను సస్పెండ్ చేశారు. భివండీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు.