Bhopal gas tragedy activist Abdul Jabbar passes away (Photo-ANI)

Bhopal, November 15: భోపాల్ గ్యాస్ బాధితుల ఉద్యమ కిరణం నేలరాలింది. 1984 భోపాల్ గ్యాస్ బాధితుల తరపున సుదీర్ఘ కాలం నుంచి పోరాడుతున్న ఉద్యమ నేత అబ్దుల్‌ జబ్బర్‌ అనారోగ్యం(Abdul Jabbar passes away)తో మరణించారు. గత కొంత కాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.

మెరుగైన చికిత్సను అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనను ముంబైకి తరలించాలని ప్రయత్నించింది. అలాగే వైద్య నిమిత్తం అయ్యే ఖర్చులను కూడా భరిస్తామని తెలిపింది. కానీ ఇంతలోనే ఆయన కన్నుమూయడం విషాదకరం.

ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదమైన భోపాల్ గ్యాస్ ప్రమాదం(Bhopal gas tragedy)లో అబ్దుల్ జబ్బర్ తన తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయారు. ఈ ప్రమాదంలో జబ్బర్ కూడా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌తో బాధడ్డారు. అంతేకాకుండా ప్రమాదం కారణంగా 50 శాతం దృష్టిని కోల్పోయినప్పటికీ జబ్బర్ న్యాయం కోసం తన పోరాటం ఎప్పుడూ ఆపలేదు.

ఉద్యమనేత కన్నుమూత

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన బాధితుల తరపున (Bhopal gas tragedy activist Abdul Jabbar ) పోరాడేందుకు 1987లో, ‘భోపాల్ గ్యాస్ పీడిత్‌ మహీళా ఉద్యోగ్ సంఘటన్’ను ప్రారంభించారు. ఈ ఘటనలో 20 వేల మంది బాధితుల న్యాయం కోసం ఆక్ష్న పోరాడుతూ వచ్చారు.

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 అర్థరాత్రి మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీక్ ( 1984 Union Carbide gas leak tragedy)కావడంతో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఇప్పటికి అనేకమంది దీని కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు భోపాల్ గ్యాస్ విషాదం జరిగిన కొద్దిసేపటికే.. అమెరికా పౌరుడైన యూనియన్ కార్బైడ్ సీఈఓ వారెన్ ఆండర్సన్ తప్పించుకున్నాడు. ఈ కేసులో విచారణకు హాజరుకాలేదు. అతను 2013లో అమెరికాలో మరణించాడు.