New Delhi, April 28: కొత్తగా ప్రారంభమైన భోపాల్-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఆవును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందుభాగం దెబ్బతింది. భోపాల్ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గ్వాలియర్‌లోని దబ్రా వద్ద ఒక్కసారిగా పట్టాలపైకి వచ్చిన ఆవును ఢీ కొట్టింది.ఈ ఘటనతో రైలును 15 నిమిషాల పాటు నిలిపివేశారు.
ట్రైన్ ముందుభాగం ధ్వంసం కావడంతో అవసరమైన మరమ్మత్తులు చేపట్టిన అనంతరం రైలు ముందుకు కదిలిందని అధికారులు తెలిపారు.ఈ సెమీ హైస్పీడ్ రైలును ఏప్రిల్ 1న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.గతంలోనూ పలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆవును ఢీకొనడంతో ఆయా రైళ్లు పాక్షికంగా దెబ్బతిన్న ఉదంతాలు చోటుచేసుకున్నాయి.