Bihar Jivitputrika Festival Tragedy (Photo/X/Screen Grab)

Patna, Sep 26: బీహార్ రాష్ట్రంలో జియుతియా స్నానాల ఆచారం 43 మందిని బలిగొంది. ఈ 'జీవితపుత్రిక' పండుగ సందర్భంగా, మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఉపవాసం ఉంటారు. నదులలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.ప్రతి సంవత్సరం అశ్విన్ మాసంలో జియుతియా పండుగ సందర్భంగా మహిళలు తమ పిల్లల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉండి పూజలు, పుణ్యస్నానాలు చేస్తారు. జితీయ వ్రతాన్ని జీవితపుత్రిక లేక జియుతియ వ్రతం అని కూడా అంటారు. ఈ క్రమంలోనే 37 మంది పిల్లలతో సహా మొత్తం 43 మంది మునిగిపోయారని, మరో ముగ్గురు అదృశ్యమయ్యారని రాష్ట్ర ప్రభుత్వం గురువారం తెలిపింది.

బుధవారం జరిగిన పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. "ఇప్పటి వరకు మొత్తం 43 మృతదేహాలను వెలికితీశారు. తదుపరి శోధన ఆపరేషన్ కొనసాగుతోంది" అని విపత్తు నిర్వహణ విభాగం (DMD) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జియుతియా స్నానాల మరణాల పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు రూ .4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు.

బీహార్‌ జీవితపుత్రికా పండుగలో విషాదం, నీట మునిగి 46 మంది మృతి ఇందులో 36 మంది పిల్లలే

నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైందని, చనిపోయిన వారిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఇప్పటికే పరిహారం అందిందని ప్రకటనలో తెలిపారు. తూర్పు, పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, గోపాల్‌గంజ్, అర్వాల్ జిల్లాల్లో మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి.

ఔరంగాబాద్ జిల్లా బరూన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదంలో 8 మంది చిన్నారులు మృతి చెందారు. వీరిలో నలుగురు బాలికలు ఉన్నారు. ఇక్కడ మహిళలు, బాలికలు చెరువులో స్నానాలు చేస్తుండగా ఈ ప్రమాదాలు జరిగాయి. మదన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుషాహాలో 18 మంది చిన్నారులు స్నానం చేస్తుండగా నీటిలో మునిగిపోతున్న సమయంలో చిన్నారుల అరుపులు విని స్థానికులు 14 మంది చిన్నారులను కాపాడారు. అయితే నీటిలో మునిగి నలుగురు చిన్నారులు చనిపోయారు.

బీహార్ లోని 14 జిల్లాల్లో జియుతియా స్నానానికి వెళ్లి మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి. వీటిలో ఔరంగాబాద్ లో అత్యధికంగా 10మంది, చప్రాలో 5 మంది, రోహతాస్ లో 4గురు, కైమూర్, సివాన్, మోతిహారిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. బెట్టియా, బెగుసరాయ్ లో మునిగి ఇద్దరు వ్యక్తులు మరణించారు. గోపాల్ గంజ్, భోజ్ పూర్, నలంద, దర్భంగా, మధుబని, సమస్తిపూర్, అర్వాల్లో ఒక్కొక్కరు మరణించినట్లు సమాచారం.