Saurabh Kumar Shot Dead in Bihar (Photo Credit: X/@snehamordani)

Patna, April2 25: బీహార్‌ (Bihar) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. సీఎం నితీశ్‌ కుమార్‌ పార్టీ జేడీయూకి చెందిన యువ నేత (JDU Leader) దారుణ హత్యకు గురయ్యాడు (shot dead). బుధవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. జేడీయూ పార్టీకి చెందిన సౌరభ్‌ కుమార్‌ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పాట్నా (Patna)లో ఓ వివాహాది కార్యక్రమానికి వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో నలుగురు వ్యక్తులు బైక్‌పై వచ్చి సౌరభ్‌పై కాల్పులు జరిపారు.

 

ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో మరో వ్యక్తికి గాయాలయ్యాయని, ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

 

ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.