Delhi, July 19: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసు దోషులకు దేశ సర్వోన్నత న్యాయం సుప్రీం కోర్టు షాకిచ్చింది. దోషులు రాధేశ్యామ్ భగవాన్ దాస్, రాజుభాయ్ బాబులాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 11 మంది దోషులను విడుదల చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది.
ప్రభుత్వానిది మతి లేని నిర్ణయమని ...దోషులతో కుమ్మక్కైన తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలిపింది న్యాయస్థానం. ఓ మహిళపై ఇంత క్రూరంగా నేరానికి పాల్పడితే శిక్ష ఎందుకు తగ్గిస్తారంటూ నిలదీసింది. తర్వాత దోషులను మళ్లీ అరెస్ట్ చేయగా మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. కానీ వారి పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కోసం మళ్లీ పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు ఎదుట దోషులకు చుక్కెదురైంది.
గుజరాత్‌లో 2002లో గోద్రా దహనకాండలో అల్లర్లు చెలరేగాయి. ఈ సమయంలో బిల్కిస్ బానో 5 నెలల గర్బవతిగా ఉండగా కొంతమంది దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాకుండా ఆమె కుటుంబంలోని 7 గురిని చంపేశారు. ఈ కేసులో 11 మంది నిందితులకు 2008లో సీబీఐ స్పెషల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. తెలంగాణ గ్రూప్ 2 వాయిదా, డిసెంబర్‌లో పరీక్ష, త్వరలో తేదీలు ఖరారు
అయితే గతేడాది జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులకు రెమిషన్ విధించింది గుజరాత్ ప్రభుత్వం. దీంతో వారంతా జైలు నుండి విడుదలయ్యారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీం కోర్టును ఆశ్రయించింది.