Bird Flu Outbreak(Photo Credits: Pixabay)

New Delhi, January 11: దేశంలో గత కొద్ది రోజుల నుంచి ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వైరస్‌ కలకలం రేపుతోంది. ఈ వైరస్ దెబ్బకు తొమ్మిది రాష్ట్రాల్లో హై అలర్ట్ విధించారు. కొన్ని వేల కోళ్లను చంపేశారు. కొన్ని రాష్ట్రాల్లో చికెన్ ఎగుమతులు, దిగుమతులు నిషేధం విధించారు. అయితే ఈ వ్యాధి మనుషులకు కూడా వ్యాప్తిస్తుందా..లేక జంతువులకే వ్యాపిస్తోందా అనే దానిపై చాలామందికి సందేహాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వైరస్‌ పక్షులనుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశం (Bird Flu Transmission) చాలా అరుదని ప్రముఖ ఢిల్లీ వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం.. ఈ వైరస్ పక్షుల నుండి మనుషులకు సంక్రమించే అవకాశం ఉందని..అయితే రిస్క్ చాలా తక్కువ (Risk is Currently Low). ఈ వైరస్ ద్వారా హెచ్1 స్ట్రెయిన్ (Current H1 Strain) మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు. ఉడికీ ఉడకని చికెన్‌ తినటం మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ (Bird Flu) సోకిన పక్షుల లాలాజలం, వ్యర్ధాల ద్వారా మనషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు.

తొమ్మిది రాష్ట్రాల్లో హై అలర్ట్, వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత, మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు రెడీ అవుతున్న బర్డ్ ఫ్లూ, అన్ని రాష్ట్రాలు అలర్ట్‌గా ఉండాలని కోరిన కేంద్రం

కలుషిత ప్రదేశాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. గాల్లో ఉన్న వైరస్‌ను పీల్చటం ద్వారా, వైరస్‌తో కలుషితమైన ప్రదేశాలను ‌ తాకి ఆ వెంటనే ముక్కు, కళ్లను ముట్టుకోవటం ద్వారా ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుందని సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తెలిపింది.

జ్వరం, దగ్గు, గొంతునొప్పి, కారే ముక్కు, ఒంటి నొప్పులు, తల నొప్పి, కళ్లు ఎర్రగా అవ్వటం వంటివి వైరస్‌ లక్షణాలుగా పేర్కొంది. ఇది మామూలు జలుబు లాంటిదేనని, కానీ, కొంతమందికి ఎక్కువ ప్రమాదకారిగా మారుతుందని తెలిపింది. గర్భిణులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, 65 సంవత్సరాల వయసు పైబడ్డవారికి ఎక్కువ నష్టం కలుగుతుందని వెల్లడించింది.

ఈ వైరస్‌పై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పల్మనరీ, క్రిటికల్‌ కేర్‌ అండ్‌ స్లీప్‌ మెడిసిన్‌ యాట్‌ పోర్టిస్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జేసీ సూరి మాట్లాడుతూ.. ‘‘ కోళ్ల ఫారాలలో పనిచేసేవారు పీపీఈ కిట్లు ధరించాలి. గ్లోజులు కూడా ధరించాలి. ఎప్పటికప్పుడు కలుషిత ప్రదేశాలను రసాయనాలతో శుభ్రం చేసుకోవాలని తెలిపారు.