Coonoor December 09:  సీడీఎస్‌ బిపిన్ రావత్(Bipin Rawat) దుర్మరణం పాలైన వాయుసేన హెలికాప్టర్‌(Helicopter)కు సంబంధించిన బ్లాక్ బాక్స్(Block Box) లభ్యమైంది. తమిళనాడు(Tamilnadu) నీలగిరి(Nilgir) జిల్లా కూనూర్ వద్ద ప్రమాద స్థలం నుంచి దాదాపు కిలో మీటరు దూరం వరకు మొత్తం జల్లెడ పట్టారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో భారీ వృక్షాలను తొలగిస్తూ బ్లాక్ బాక్స్(Block Box) కోసం గాలింపు(Search Operation) చేపట్టారు.

దీంతో ఈ ఉదయం భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్‌ బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు ఫోరెన్సిక్‌ సైన్స్‌(Forensic) విభాగానికి చెందిన బృందం గుర్తించింది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ లభ్యమైంది. అనంతరం బ్లాక్‌బాక్స్‌ను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకొని, వెల్లింగ్టన్‌ బేస్‌ క్యాంప్‌(Wellington Base Camp) కు తరలించారు. అక్కడికి ఢిల్లీకి తరలించి, అందులో ఉన్న డేటాను డీకోడ్‌ చేయనున్నారు.బ్లాక్ బాక్స్‌లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా నిక్షిప్తమై ఉంటుంది. క్రాష్(Crash) అయిన సమయంలో మాత్రం ప్రమాదానికి ముందు అరగంట ముందు ఏం జరిగిందన్న సమాచారం అందివ్వనున్నది.

చిట్టి తల్లిని చూడాలని ఉందంటూ భార్యకు ఫోన్, వీడియో కాల్ చేస్తానంటూ.. కొద్ది గంటలకే హెలికాఫ్టర్ ప్రమాదంలో తెలుగు తేజం సాయితేజ్ మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం జగన్

సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌(CDS Bipin Rawat), సహా 14 మంది ప్రయాణిస్తున్న ఐఏఎఫ్‌(IAF)కు చెందిన హెలికాప్టర్‌(Helicopter) బుధవారం తమిళనాడులోని కూనూర్‌లో కూలిపోయిన విషయం తెలిసిందే. జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ హెలికాప్టర్‌ ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉన్నది. అలాగే ప్రమాదానికి ముందు పైలెట్లు జరిపిన సంభాషణ సైతం రికార్డయ్యే అవకాశాలుంటాయి. హెలికాప్టర్‌ ప్రమాద దర్యాప్తులో బ్లాక్‌ బాక్స్‌ కీలకం కానున్నది.