New Delhi, July 06: ప్రముఖ కథారచయిత విజయేంద్ర ప్రసాద్‌ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన్న రాజ్యసభకు నామినేట్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. విజయేంద్ర ప్రసాద్ తో పాటూ, లెజండరీ మ్యూజిక్ డైరక్టర్ ఇళయరాజా, ఎందరో క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తున్న పీటీ ఉష(P.T. usha), ప్రముఖ సామాజిక సేవా వేత్త వీరేంద్ర హెగ్దేలను కూడా రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja)తో పాటు, కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ (Vijayendra prasad) రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు నలుగురూ వివిధ రంగాల్లో చేసిన సేవలను గుర్తిస్తూ ఆయన ట్వీట్లు చేశారు. తాజాగా రాజ్యసభకు (Rajya sabha) ఎంపికైన నలుగురూ దక్షిణాది వారే కావడం గమనార్హం. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, తమిళనాడు నుంచి ఇళయరాజా, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్డే, కేరళ నుంచి పీటీ ఉషను ఎంపిక చేశారు. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాలుగా సృజనాత్మక రంగంలో సేవలందిస్తున్నారని, ఆయన సేవలు భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాయని ప్రధాని ట్వీట్ చేశారు.

సంగీత దర్శకుడు ఇళయరాజా అందించిన సేవలు తరాలపాటు నిలిచిపోతాయని, ఆయన కళ ఎన్నో భావోద్వేగాల్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు. ఇళయరాజా జీవితం స్ఫూర్తిదాయకమని, సాధారణ నేపథ్యం నుంచి వచ్చి, ఎంతో ఖ్యాతి సంపాదించారని ప్రశంసించారు. పీటీ ఉష ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. వైద్యం, విద్య వంటి రంగాల్లో వీరేంద్ర హెగ్డే ఎంతో గొప్ప సేవ చేశారని ప్రధాని అభినందించారు.

Mukhtar Abbas Naqvi Resigns: ఉపరాష్ట్ర పదవి కోసమేనా.. కేంద్ర మంత్రి పదవికి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ రాజీనామా, ఆయనతో పాటు కేబినెట్ నుంచి వైదొలిన కేంద్ర స్టీల్ శాఖ మంత్రి ఆర్‌సీపీ సింగ్ 

విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి(SS Rajamouli) తండ్రి మాత్రమే కాదు, పలు సినిమాలకు ఆయన కథా రచయితగా పని చేశారు. ఉత్తమ రచయితగా జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. భజరంగీ భాయిజాన్ (Bajarangi Bhaijaan) తో పాటూ, విశ్వవ్యాప్తంగా భారతీయ సినిమా కీర్తిని చాటిన బాహుబలి (Bahubali), RRR సినిమాలకు కూడా ఆయనే కథలను అందించారు.