Home Minister Amit Shah (Photo Credit: X/IANS)

న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ పోలీస్ కంట్రోల్ రూంకు బుధవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దేశ రాజధానిలో అమిత్‌షా (Amit Shah) నియంత్రణలోని హోంశాఖను (Ministry Of Home Affairs) పేల్చేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ఈమెయిల్‌ చేసినట్లు మంత్రిత్వ శాఖలోని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.  ఉగ్రవాదులతో విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు, ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు చేసుకున్న ఆర్సీబీ, నేడు కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌

ఈ ఘటనపై మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం వెంటనే నార్త్‌ బ్లాక్‌లోని రెడ్‌ స్టోన్‌ బిల్డింగ్‌ వద్దకు చేరుకొని సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. బాంబ్‌ స్వ్కాడ్‌, జాగిలాల సాయంతో బిల్డింగ్‌ మొత్తం తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ, పేలుడు పదార్థాలూ దొరకలేదు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈమెయిల్‌ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.