Panaji, June 7: గోవాలో దారుణం చోటు చేసుకుంది. గోవా ట్రిప్ కోసం వచ్చిన ఓ బ్రిటిష్ జంటకు అక్కడ చేదు అనుభవం (Goa Shocker) ఎదురైంది. గోవాలోని అరాంబోల్ బీచ్‌కు బ్రిటన్‌కు చెందిన కపుల్స్ (British woman on holiday with husband) వచ్చారు. ఈ క్రమంలో వారికి టూరిస్ట్ గైడ్‌గా విన్సెంట్ డిసౌజా పరిచయం చేసుకుని చుట్టుపక్కల బీచ్‌లు తిప్పాడు. ఆ తరువాత అంతర్జాతీయ పర్యాటకులతో బాగా ప్రాచుర్యం పొందిన ఉత్తర గోవా జిల్లాలోని అరాంబోల్ బీచ్ సమీపంలో మసాజ్ చేపిస్తానంటూ వారిని అక్కడికి తీసుకెళ్లాడు. మసాజ్ చేస్తున్న క్రమంలో డిసౌజా.. భర్త కళ్ల ముందే ఆమెపై లైంగిక దాడికి ( raped at north Goa beach) పాల్పడ్డాడు.
ఈ ఘటన జూన్ 2వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ దారుణ ఘటన అనంతరం బాధితులు.. బ్రిటన్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులను సంప్రదించి.. భారత్‌లోని బ్రిటిష్ రాయబార కార్యాలయం నుంచి సహాయం కోరిన తర్వాత బాధితులురాలు పెర్నెమ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
నిందితుడు గతంలో ఓ పాఠశాలలో లైబ్రేరియన్‌గా కూడా పనిచేశాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నిందితుడి అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడిని సత్వరమే అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం రష్యా దేశానికి చెందిన యువతిపై ఓ భారతీయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. భర్తతో కలిసి విహార యాత్ర కోసం వచ్చిన బ్రిటన్ మహిళపై నార్త్ గోవాలోని అరంబల్ స్వీట్ వాటర్ బీచ్ వద్ద లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. గత వారం ఈ దారుణం చోటుచేసుకోగా ఘటనకు సంబంధించి 32 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.