New Delhi, Jan 30: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో..నేడు అఖిలపక్ష సమావేశం (All-Party Meeting in Parliament) నిర్వహించింది కేంద్రం.పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ లీడర్ రాజ్‌నాథ్‌సింగ్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సభా నాయకుడు ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీయూష్ గోయల్, అర్జున, రామ్ మేఘ్‌వాల్, వీ మురళీధరన్ తదితరులు హాజరయ్యారు.
బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సజావుగా సభలు సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా విపక్షాలను కోరింది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేకానుంది. అందుకే విపక్షాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ (Congress Leaders Absent) ఈ భేటికీ డుమ్మా కొట్టింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశానికి నేతృత్వం వహించారు.
డీఎంకే నేత, టీఆర్, బాలు, టీఎంసీ నేతలు సుదీప్ బందోపాధ్యాయ, సుఖేందు శేఖర్ రే, టీఆర్‌ఎస్ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలందరూ హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి విజయసాయిరెడ్డి, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నుంచి ప్రొఫెసర్ మనోజ్ ఝా, జేడీయూ నుంచి రామ్ నాథ్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు. శివసేన (ఉద్ధవ్ థాకరే) తరపున ప్రియాంక చతుర్వేది ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి.మురళీధరన్ సైతం హాజరయ్యారు.
ఇదిలా ఉంటే.. మంగళవారం పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలుకానున్నాయి. ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఇక బుధవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.ఇక కాంగ్రెస్ నాయకులు సమావేశానికి గైర్హాజరయ్యారు, అయితే, ప్రభుత్వ వర్గాల ప్రకారం మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి ఇద్దరూ భారత్ జోడో యాత్ర కారణంగా ఈరోజు శ్రీనగర్‌లో ఉండిపోయారని తెలుస్తోంది.
2023-24 కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం రాజ్యసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గురువారం నుండి, ఉభయ సభలు "రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం"పై చర్చను నిర్వహిస్తాయి, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ లోక్ మరియు రాజ్యసభ రెండింటిలోనూ సమాధానం ఇవ్వనున్నారు. బడ్జెట్ సెషన్‌లోని ఈ భాగం ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుంది.బడ్జెట్ సెషన్ యొక్క రెండవ భాగం విరామం తర్వాత మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుంది. వివిధ మంత్రిత్వ శాఖలకు గ్రాంట్ల డిమాండ్‌పై చర్చ జరుగుతుంది. అనంతరం కేంద్ర బడ్జెట్ ఆమోదించబడుతుంది.