తమిళనాడులో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 40 మందికి పైగా గాయపడ్డారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కడలూరు-పన్రుటి మధ్య రెండు ప్రైవేట్ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ముందుగా ఒక బస్సు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులు నజ్జునుజ్జుయినట్లు తెలుస్తోంది. ఘటనపై స్పందించిన సీఎం స్టాలిన్‌.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)