Bangalore, FEB 22: సైకిళ్లు, బైకులు, కార్లు చోరీకి గురి అవుతుండడం గురించి మనం తరుచూ వింటుంటాం. అయితే, కర్ణాటకలో (Karnataka) దొంగలు ఏకంగా ఓ బస్సును చోరీ (Bus stolen) చేశారు. కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్టేషన్ కార్పొరేషన్ (KKSRTC)కు చెందిన ఓ బస్సు చోరీ కావడం కలకలం రేపింది. పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేకపోవడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కర్నాటకలోని కలబురగి జిల్లాలోని చించోలి బస్టాండ్లో పార్కింగ్ చేసి ఉన్న బస్ను కొందరు KA-38 F-971 నంబర్ గల ఈ బస్సు.. బీదర్ రెండో డిపోకు చెందినదిగా గుర్తించారు. ఈ బస్సు చించోలి – బీదర్ మధ్య రాకపోకలు (Chincholi bus stand) సాగిస్తోంది.
చోరీకి గురైన బస్సు.. సోమవారం రాత్రి బీదర్ నుంచి ప్రయాణికులతో చించోలికి వచ్చింది. ఆ తర్వాత 9.15 గంటలకు బస్ స్టాండ్లో పార్కింగ్ చేశారు. ఉదయం బస్సును బీదర్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. బస్సు కనిపించలేదు. దీంతో కంగుతిన్న డ్రైవర్.. ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించాడు. ఆర్టీసీ అధికారులు.. చించోలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి చోరీకి గురైన బస్సును, నిందితుడిని వెతికారు. కర్ణాటక ఆర్టీసీ అధికారులు కూడా రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపులు జరిపారు. అనంతరం తెలంగాణలో బస్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. బస్సును దొంగిలించిన వారు మాత్రం దొరకలేదు. వారి ఆచూకీ తెలియాల్సి ఉంది.