New Delhi, June 3: వన్ నేషన్ వన్ మార్కెట్ (One Nation, One Market) ఏర్పాటు దిశగా ముందడుగు వేస్తూ రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఎక్కడైనా అంటే ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేలా అనుమతినిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు మేలు చేసేందుకు నిత్యావసరాల చట్టాన్ని సవరించాలని కూడా నిర్ణయించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ (Union Minister Prakash Javadekar) తెలిపారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8909 తాజా కేసులు నమోదు, దేశంలో 2 లక్షల దాటిన కోవిడ్-19 కేసులు, 5815కు చేరిన మరణాల సంఖ్య
నిత్యావసరాల చట్టాన్ని సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుని రైతుల ఆదాయం పెరిగేందుకు బాటలు పడతాయని జవదేకర్ చెప్పారు. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీతో ఏర్పడుతున్న ఇబ్బందులు రైతులకు ఇక ఉండబోవు. దీంతో పాటుగా కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ పేరును శ్యామప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్‌గా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందని జవదేకర్ తెలిపారు.
కేంద్ర క్యాబినెట్ బుధవారం తీసుకున్న నిర్ణయాలు గ్రామీణ భారతానికి ఎంతో మేలు చేస్తాయని ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్న వ్యవసాయ సంస్కరణలకు తాము శ్రీకారం చుట్టామని, దీంతో వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని ప్రధాని ట్వీట్ చేశారు. అత్యవసర వస్తువుల చట్టంలో తీసుకొచ్చిన సవరణలు రైతుల ఆదాయాన్ని పెంచుతాయని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు.
Here's PM Tweet
Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Ordinance, 2020 approved by the Cabinet will ensure our farmers get greater freedom to engage with processors, wholesalers, large retailers, exporters while also protecting farmers’ interests.
— Narendra Modi (@narendramodi) June 3, 2020
బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జవదేకర్.. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. అత్యవసర వస్తువుల సవరణ చట్టానికి (ఎసెన్సియల్ కమోడిటీస్ యాక్ట్‌కు) క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. రైతుల కోసం కేంద్ర కేబినెట్ మూడు కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. గతంలో ఈ చట్టాన్ని ఆహార కొరతను ఎదుర్కొన్న సమయంలో అమలు చేశారని.. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ చట్టం ద్వారా 50 ఏళ్ల రైతుల డిమాండ్ నెరవేరిందని జవదేకర్ అన్నారు. పెట్టుబడులను ఆకర్శించేందుకు ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్స్(పీడీసీ)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. కరోనా యాప్‌ను ప్రారంభించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో 10 మందికి కరోనా వైరస్
దీంతో పాటుగా పరిమిత సంఖ్యలో విదేశీ వ్యాపారుల ప్రయాణాలకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేకంగా ఎంచుకున్న కేటగిరిలోనే దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వైద్యరంగ సంబంధిత నిపుణులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుంది. వారిలో హెల్త్‌కేర్ నిపుణులు, పరిశోధకులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరు సడలింపులు పొందేందుకు మొట్టమొదట ఆయా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ లేదా రిజిస్టర్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వాన పత్రం పొందవలసి ఉంటుంది.
ఉత్పత్తి సంస్థలు, డిజైనింగ్ యూనిట్లు, సాఫ్ట్‌వేర్, ఐటీ యూనిట్లు, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సెక్టార్ రంగాలలో పనిచేస్తున్న వారికి అనుమతులు ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే వ్యాపారవేత్తలు స్పెషల్ పర్మిట్ బిజినెస్ వీసాపై మాత్రమే నాన్‌షెడ్యూల్ కమర్షియల్, చార్టడ్ విమానాల్లో వచ్చేందుకు అనుమతులు ఉంటాయి. భారతదేశంలో ప్రముఖ బిజినెస్ సంస్థలు విదేశీ సాంకేతిక నిపుణులను ఆహ్వానించడానికి అనుమతులు ఇచ్చింది. విదేశీ మూలం యంత్రాలు, పరికరాల సౌకర్యాలకు, మరమ్మత్తు, నిర్వహణ కోసం విదేశీ ఇంజనీర్లను దేశానికి రప్పించవచ్చు. కాగా వీరికి షరతులతో కూడిన వీసాలను మంజూరు చేయవలసి ఉంటుంది.
ఇదే విషయమై కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి స్పందిస్తూ.. ' అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు మేము పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పరిస్థితి కొంచెం సాధారణ స్థితికి చేరుకోగానే అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభిస్తాం. పౌరులకు ఎటువంటి ప్రమాదం కలిగించదు. అయితే వ్యాపార నిమిత్తం తమ దేశానికి వచ్చే విదేశీయులకు పరిమిత వీసాలపై అనుమతించేదుకు సిద్దంగా ఉన్నాం' అంటూ ట్విటర్లో తెలిపారు.