New Delhi, July 14: నిన్న 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన సీబీఎస్ఈ (Central Board of Secondary Education) రేపు 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తోంది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "ప్రియతమ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులారా... రేపు సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు (CBSE Class 10th Results 2020) ప్రకటిస్తున్నారు. విద్యార్థులందరికీ బెస్టాఫ్ లక్" అంటూ రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, పదో తరగతి ఫలితాలు కూడా త్వరలో విడుదల, ఫలితాలను http://results.nic.in/ లేదా http://cbse.nic.in/ లేదా http://cbseresults.nic.in/ ద్వారా చెక్ చేసుకోండి
కాగా కరోనా సంక్షోభం కారణంగా సీబీఎస్ఈ పరీక్షలపై కొన్నిరోజులుగా తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. కొన్ని పరీక్షలు నిలిచిపోవడంతో వాటికి రీషెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కరోనా పరిస్థితుల పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా పరీక్షలు జరపడం సమంజసం కాదని కోర్టుకు తెలిపారు.
ఈ నేపథ్యంలో, పరీక్షలు రద్దు చేసిన సీబీఎస్ఈ ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించుకుంది. ఒకవేళ ఈ ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు పెండింగ్ లో ఉన్న పరీక్షలు రాసే వెసులుబాటు కూడా బోర్డు కల్పిస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను తర్వాత ప్రకటిస్తారు.