Interest on Interest: దసరా కానుక, వడ్డీపై వడ్డీ మాఫీ రద్దుకు మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఎవరికి వర్తిస్తాయో ఓ సారి తెలుసుకోండి
Indian Currency Representational Image (Photo Credits: PTI)

New Delhi,Oct 24: రుణాలు తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం దసరా పండుగ కానుకను అందించింది. కరోనావైరస్, లాక్‌డౌన్‌ కాలంలో బ్యాంకులు రుణాల మారటోరియం (Moratorium Period ) అమలు చేసిన సంగతి విదితమే. దీనిపై రుణగ్రహీతలకు పండుగ కానుకగా మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ రద్దుకు (Interest on Interest) సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) జారీ చేసింది.

కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ (RBI) ప్రకటించిన మారటోరియం పథకం కింద రూ .2 కోట్ల వరకు రుణాలపై "వీలైనంత త్వరగా" వడ్డీ మినహాయింపును అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన తరువాత ఈ మార్గదర్శకాలు వచ్చాయి.

గుడ్ న్యూస్..రూ.2 కోట్ల లోపు రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం, పలు రుణ గ్రహీతలకు భారీ ఊరట

ఆర్థిక శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఆరు నెలల కాలానికిగాను (మార్చి 1 నుండి ఆగస్టు 31, 2020 వరకు) 2 కోట్ల రూపాయలకు మించని హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, క్రెడిట్ కార్డు రుణాలు, వెహికల్ లోన్స్, ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ మీద వడ్డీ మాఫీ అందుబాటులో ఉంటుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు వడ్డీ డబ్బులను కస్టమర్ల లోన్ అకౌంట్‌లో జమ చేస్తాయి.

వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం, రుణ మారటోరియం పరిధిని పొడిగించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, ఆర్‌బీఐ

దీన్ని అనంతరం కేంద్రం నుంచి ఆయా బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. రుణగ్రహీత పూర్తిగా లేదా పాక్షికంగా తాత్కాలిక నిషేధాన్ని పొందారా అనే దానితో సంబంధం లేకుండా చక్రవడ్డీకి, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని చెల్లిస్తుంది. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.6,500 కోట్లు అదనపు భారం పడనుంది.