Tamil Nadu: తాగిన మత్తులో తండ్రి ఘాతుకం..నేలపై పడుకున్న కూతురిపై అత్యాచార దాడి, దారుణాన్ని చూడలేక సుత్తితో కొట్టి చంపేసిన భార్య, చెన్నైలో ఘటన వెలుగులోకి
Representational Image (Photo Credits: File Image)

Chennai, Jan 31: చెన్నైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యంమత్తులో విచక్షణ మరిచి కన్నకూతురిపైనే ఓ దుర్మార్గపు తండ్రి అత్యాచార దాడి (Man Tries to Sexually Assault Daughter) చేశాడు. భర్త ఘాతుకాన్ని ఆపడానికి, కూతురిని కాపాడుకోవడం కోసం ఆ తల్లి, తన భర్తను (Wife Hammers Him to Death) హతమార్చింది.

ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒంటేరిలోని వజీమా నగర్ లో ప్రదీప్ (44), ప్రీతి (41) భార్యాభర్తలు. వీరికి ఒక కూతురు(20), ఒక కొడుకు. కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో ఇటీవల కలతలు చెలరేగాయి. ప్రదీప్ పనిపాట చెయ్యకుండా సుఖంగా ఉండటానికి అలవాటు పడ్డాడు. దీంతో ఇంట్లో కుటుంబ భారాన్ని మొత్తం ప్రీతిపై పడింది. మామ టైలర్ పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు.

ఇక నిత్యం ప్రదీప్ మద్యం తాగి వచ్చి భార్యాపిల్లలను కొట్టడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే గతరాత్రి మద్యం తాగి ఇంటికి ప్రదీప్ ఇంటివి వచ్చాడు. కూతురు నేలపై పడుకుని ఉండటంతో విచక్షణ మరిచిన కామాంధుడు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. దీంతో ఆ యువతి గట్టిగా కేకలు వేయడంతో పక్క గదిలో ఉన్న ప్రీతీ ఆ ఘాతుకాన్ని చూసి నిర్ఘాంతపోయింది. వెంటనే కూతురును కాపాడాలనే తాపత్రయంతో ఇంట్లో ఉన్న సుత్తి తీసుకుని ఆమె భర్తను చంపేసి కూతుర్ని రక్షించుకుంది.

బాలుడిపై లైంగిక దాడి, బాధను తట్టుకోలేక చిన్నారి అరవడంతో గొంతు పిసికి చంపేశాడు, నిందితుడిని అరెస్ట్ చేసిన ఒంగోలు పోలీసులు, వివరాలను వెల్లడించిన ఎస్పీ మలికాగర్గ్‌

వెంటనే ఈ విషయాన్ని స్థానికులు తెలుపగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ప్రీతిని అరెస్ట్ చేశారు. కాగా భర్త క్రూరమైన చర్య నుంచి తన బిడ్డను రక్షించుకునేందుకు ఈ చర్యకు పాల్పడినట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది.

14 ఏళ్ల బాలికపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, ఆత్మహత్య చేసుకున్న బాలిక, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తెలుగుదేశం పార్టీ

ఏపీలో కన్నకూతురిపై తండ్రి అత్యాచారయత్నానికి పాల్పడిన దారుణఘటన ఖాజీపేట పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఖాజీపేటకు చెందిన శివ ప్రాసద్‌కు భార్య, పదకొండేళ్ల కూతురు ఉంది. కామంతో కళ్లు మూసుకుపోయిన అతను కూతురిపై కన్నేశాడు. శుక్రవారం రాత్రి నిద్రపోతున్న సమయంలో అ‍త్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో తల్లి గమనించింది. కుమార్తె ద్వారా విషయం తెలుసుకొని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసినట్లుఎస్‌ఐ కుళ్లాయప్ప తెలిపారు. అనంతరం చిన్నారిని పిలిపించి విచారించారు. నిందితుడు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.