Madurai Shocker: ఘోర విషాదం, అప్పులు బాధతో కుటుంబం మొత్తం ఆత్మహత్య, తమిళనాడు రాష్ట్రంలో విషాద ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Madurai, May 12: తమిళనాడులోని మదురై జిల్లాలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది, ఆర్థిక ఒత్తిడి కారణంగా ఒక జంట తమతో పాటు వారి ముగ్గురు మైనర్ పిల్లలను కూడా చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్లు (Madurai Shocker) పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న దంపతులను (tamil nadu, couple) ఎ శరవణన్ (35), విజి (30) గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉసిలంపట్టి పట్టణంలోని ఆర్.కె. తేవర్ వీధిలో నివసిస్తున్న ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు, పెద్ద కుమార్తెకు కేవలం 10 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉంది. శరవణ స్వర్ణకారుడు. అతని తండ్రి మరణించిన తరువాత, అతను తన ఆభరణాల తయారీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు.

ఇతడికి భార్య శ్రీనిధి, కుమార్తెలు మహాలక్ష్మి (10), అభిరామి (5), కుమారుడు అముదన్‌ (5) ఉన్నారు. శరవణన్‌ సుమారు 20 ఏళ్లుగా వర్క్‌షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఏడాదిన్నరగా అతడి వ్యాపారం దెబ్బతింది. మరోవైపు కుటుంబ పోషణ కోసం శరవణన్ దొరికిన చోటల్లా అప్పులు చేసుకుంటూ వచ్చాడు. అయితే రోజురోజుకీ పరిస్థితి (debts problems) దిగజారడం, రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో అతడికి ఏం చేయాలో పాలుపోలేదు.

యూపీలో ఘోరం..శవాలపై బట్టలను కూడా వదలని దొంగలు, ఏడుగురిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు, అంటువ్యాధి చట్టం క్రింద కేసు నమోదు

కాగా తని భార్య విజి ఉదయం ఒకసారి ఇంటిని శుభ్రం చేయడానికి బయటకు వచ్చినప్పుడు స్థానికులకు కనిపించింది. పాలు కొనడానికి సమీపంలోని దుకాణాన్ని సందర్శించినప్పుడు ఆమె పెద్ద కుమార్తె కూడా కనిపించింది. అయిత ఆ తర్వాత నుంచి వారు కనిపించలేదు. ఏ జరిగిందోనని తెలుసుకునేందుకు ఫ్లాటుగా వెళ్లగా అక్కడ అందరూ విగత జీవులుగా పడి ఉన్నారు. కాగా సోమవారం భార్యభర్తలు, ముగ్గురు పిల్లలు బంగారు ఆభరణాలను తయారు చేయడానికి ఉపయోగించే సైనైడ్ రసాయనాన్ని తాగారు. కొద్దిసేపటికే అందరూ నురగలు కక్కుకుంటూ చనిపోయారని (tamil nadu couple commits suicide,) పోలీసులు తెలిపారు.

వెంటనే ఈ విషాద సంఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. సంఘటనా స్థలంలో దొరికిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఘటనా స్థలంలో శరవణన్ రాసిన ఒక సూసైడ్ నోట్ దొరికింది, ఇందులో మా మరణాలకు ఎవరూ బాధ్యత కాదని అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నామని రాసినట్లుగా పోలీసులు తెలిపారు.