Bastar, April 27: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం దంతెవాడ (Dantewada) జిల్లాలో మావోయిస్టుల (Maoists) దాడిలో 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే.ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్(Bhupesh Baghel) మృతులకు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా సీఎం జవాన్ శవపేటికను మోశారు. వాహనం వరకు ఆయన దానిని తీసుకెళ్లారు.నివాళి అనంతరం జవాన్ల మృతదేహాలను ఓ వాహనంలో వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు.
మిన్నంటిన రోదనల మధ్య జవాను శవపేటిక మోసిన సీఎం, దంతెవాడలో మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్లకు నివాళి
ఈ సమయంలో జవాన్ల కుటుంబ సభ్యుల వేదన చూపరులను కంటతడిపెట్టించింది. పిల్లలు, కుటుంబసభ్యుల రోదనలు ఒకపక్క.. ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు మరోపక్క వినిపిస్తుండగా.. ఆ శవపేటికలను స్వస్థలాలకు తరలించారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘జవాన్ల త్యాగాలు వృథాగా పోవు. మావోయిస్టులను మట్టుపెట్టేందుకు జరుపుతోన్న పోరును మరింత తీవ్రం చేస్తాం’అని వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని అరన్‌పూర్ ఏరియా అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ) పోలీసులు యాంటి మావోయిస్టు ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో మార్గమధ్యంలో మావోయిస్టులు పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని టార్గెట్‌గా చేసుకొన్నారు.
Here's Updates
है नमन उनको कि जिनके सामने बौना हिमालय ⁰जो धरा पर गिर पड़े पर आसमानी हो गये हैं ⁰लिख चुकी है विधि तुम्हारी वीरता के पुण्य लेखे ⁰विजय के उदघोष, गीता के कथन तुमको नमन है
🙏🏻🙏🏻
📍दंतेवाड़ा pic.twitter.com/nsoh7cnZbC
— Bhupesh Baghel (@bhupeshbaghel) April 27, 2023
है नमन उनको कि जिनको काल पाकर हुआ पावन ⁰शिखर जिनके चरण छूकर और मानी हो गये हैं⁰कंचनी तन, चन्दनी मन, आह, आँसू, प्यार, सपने⁰राष्ट्र के हित कर चले सब कुछ हवन तुमको नमन है #दंतेवाड़ा pic.twitter.com/DKwhbUSaqz
— Bhupesh Baghel (@bhupeshbaghel) April 27, 2023
అరన్‌పుర్-సమేలీ మధ్యలో ప్రధాన రహదారికి సమీపంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు మాటు వేశారు.రోడ్డుపై ఓ చోట గుంత తీసి ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (improvised explosive device )ని అమర్చారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకోగానే రోడ్డు మధ్యలో అమర్చిన ఐఈడీ బాంబులను పేల్చారు.ఈ పేలుడు దాటికి మినీ బస్సు తునాతునకలైంది. రోడ్డుపై పది అడుగుల లోతు గొయ్యి పడింది. ఈ దాడిలో 10 మంది పోలీసులు, ఒక డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.